తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు జాబితాలు ప్రకటించారు. జనసేనకు 24 స్తానాలు అసెంబ్లీ, టీడీపీ 94 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక, పార్లమెంటు స్థానాలకు వచ్చే సరికి జనసేనకు 3 స్థానాలు కేటాయించారు. ఇక, టీడీపీకి ఎన్ని అనేది గోప్యంగా ఉంచారు. అయితే.. ఇప్పటి వరకు ప్రకటించిన దానిని బట్టి అసెంబ్లీకి ఉన్న మొత్తం 175 స్థానాల్లో 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
అయితే.. వీటిలో టీడీపీ ఒక్కపార్టీని తీసుకుంటే.. మెజారిటీ స్థానాలు గత ఎన్నికల్లోను.. ఇంతకు ముందు ఓడిపోయిన అభ్యర్థులకే కేటాయించారు. కేవలం 5 నుంచి 6 స్థానాలలో మాత్రమే కొత్తవారికి అవకాశం ఇచ్చారు. తుని(యనమల దివ్య), కళ్యాణదుర్గం(అమలినేని సురేంద్రబాబు), చింతలపూడి(ఎస్సీ-సొంత రోషన్ బాబు), కడప(మాధవి), పులివెందుల(బీటెక్ రవి), తిరువూరు(కొలికపూడి శ్రీనివాసరావు)లు మాత్రమే కొత్తవారు. మిగిలిన వారంతా గత ఎన్నికల్లోనో.. ఇంతకు ముందో ఓడిన వారు కావడం గమనార్హం.
అయితే.. ఇలా పాతముఖాలకు చోటు ఇవ్వడం వెనుక మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. వారికి గతంలో ఓడిపోయారన్న సింపతి ఉండడం. ఇది పార్టీని గెలిపిస్తుందని చంద్రబాబు విశ్వసిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండోది.. ఆర్థికంగా, కేడర్ పరంగా వారికి మంచి మార్కులు ఉండడం.. మూడు క్షేత్రస్థాయిలో జనసేనతో కలిసి పనిచేస్తున్న తీరు. ఈ మూడు అంశాలను ప్రామాణింకంగా తీసుకుని చంద్రబాబు ప్రయోగానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే.. అసమ్మతి ప్రభావాన్ని వీరు తట్టుకుని నిలబడగలిగితే.. బాగానే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on February 24, 2024 1:27 pm
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…