Movie News

ఆ సంస్థకు చుక్కలు చూపిస్తున్న 2026

కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్ రేంజ్ మూవీతో ఈ సంస్థ మొదలైంది. ఆ తర్వాత ‘బై టు లవ్’ అనే మరో చిన్న చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇలా మామూలుగా ప్రయాణం మొదలుపెట్టిన సంస్థ ఉన్నట్లుండి భారీ చిత్రాల వైపు మళ్లింది. తమిళంలో నంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్‌తో అతడి చివరి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసే అరుదైన అవకాశాన్ని ఈ సంస్థ దక్కించుకుంది. ఆ చిత్రమే.. జననాయగన్.

మరోవైపు ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలతో తిరుగులేని స్థాయికి ఎదిగిన యశ్‌ తర్వాతి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశమూ ఈ సంస్థకే లభించింది. అంతే కాక ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి రీజనల్ బ్లాక్‌బస్టర్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమా సైతం కేవీఎన్ సంస్థలోనే కావడంతో దీని అధినేత నారాయణ చాలా లక్కీ అని అంతా అనుకున్నారు. 2026లో ఈ సంస్థ పేరు మార్మోగిపోతుందనే చర్చ కూడా జరిగింది. సంక్రాంతికి ‘జననాయగన్’ రిలీజ్‌తో కేవీఎన్ హవా మొదలవుతుందని అంతా అనుకున్నారు.

కానీ ‘జననాయగన్’ సెన్సార్ చిక్కుల్లో పడి ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. అసలెప్పుడు రిలీజవుతుందో తెలియట్లేదు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలతో పాటు ఓటీటీ డీల్ సైతం రద్దయింది. వాయిదా వల్ల నారాయణ భారీగా నష్టపోతున్నారు. భారీ లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న సినిమా కాస్తా.. నారాయణకు చేదు అనుభవం మిగిల్చేలా ఉంది.

మరోవైపు గల్ఫ్ వార్ పుణ్యమా అని.. ‘టాక్సిక్’ సినిమాను మార్చి 19 నుంచి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అసలు కారణాలు వేరే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రకటించినట్లు జూన్‌లో అయినా సినిమా రిలీజవుతుందో లేదో తెలియట్లేదు. ఇక చిరు, బాబీ సినిమా కూడా అనుకున్న సమయానికి మొదలు కావట్లేదు. దాని మీద కూడా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.

ఈ తలనొప్పులు చాలవన్నట్లు.. ఇప్పుడు కేవీఎన్ వారి మరో చిత్రం ‘కేడీ’ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఐటెం సాంగ్‌లో లిరిక్స్ తీవ్ర దుమారం రేపాయి. సినిమా మీద చాలా నెగెటివిటీని తెచ్చిపెట్టిందా సాంగ్. దీంతో ఆ పాటనే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తంగా 2026 కేవీఎన్ సంస్థకు అద్భుతంగా ఉంటుందని ఆశిస్తే.. ఆ బేనర్‌లో ప్రతి సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ చేదు అనుభవాలనే మిగులుస్తాయి. ఈ కష్టాలకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

This post was last modified on March 18, 2026 2:38 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

31 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

59 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago