పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నా రు. వచ్చే ఎన్నికల్లో 17 స్థానాలకు గాను.. 14 చోట్ల విజయం దక్కించుకుని తీరాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్.. దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో మరో రెండు హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయించారు.
ఉప సంఘం నిర్ణయం మేరకు.. గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ 2 పథకాలు ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలపై భేటీలో కీలకంగా చర్చించారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపైనా చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని అన్నారు.
సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా, లేదా ఏజెన్సీలకు చెల్లించాలా? అనే విషయంపై చర్చించారు. అనుమానాలు, అపోహలకు తావు లేకుండా పథకాలు అమలు చేయాలని నిర్దేశించారు. అలాగే, గృహ జ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలన్నారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ ఈ పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.
వారందరికీ 200 యూనిట్లు..
తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ గృహ జ్యోతి.. పథకం వర్తింపచేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డు నెంబర్, విద్యుత్ కనెక్షన్ నెంబర్ తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారు ఉంటే.. అలాంటి వారికి తప్పులు సవరించుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. అలాగే, ప్రజాపాలన దరఖాస్తు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సూచించారు. ఇక, ఈ పథకాల అమలుతో ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఫలితంగా.. సామాన్య ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై ఒక రేంజ్‌లో గుర్తింపు తేవాలని రేవంత్ భావిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
This post was last modified on February 22, 2024 10:02 pm
అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…
ఇటీవలే విడుదలైన దిల్ రుబా కిరణ్ అబ్బవరంకు పెద్ద షాకే ఇచ్చింది. ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షో నుంచే…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం…
రాజకీయాల్లో కొందరు నేతల తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంతదాకా అయినా వెళతారు. ఈ…