ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ కవిత నివాసం వద్ద స్టేట్‌మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసుల్లో ఆదేశించింది. అయితే.. ఈ నోటీసులు బుధవారం రాత్రి 10 గంటల తర్వాత.. ఆమెకు జారీ చేయడం గమనార్హం. ఇదంతా ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారన్న వాదన బీఆర్ ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు గతంలో ఆమె ఇంటి దగ్గర విచారణ చేశారు. తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వటంతో బీఆర్ ఎస్ శిబిరంలో అలజడి రేగింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత హాజరు కావడం లేదు. తాజాగా సీబీఐ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక, లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఈడీపై వేసిన పిటిషన్ ఫిబ్రవరి 16న సుప్రీం కోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.
లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులను కవిత గతేడాది సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీం కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల బెంచ్ దీన్ని విచారణ చేసింది. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు పెండింగ్ లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు ఇస్తు్న్నప్పటికీ కవిత గైర్హాజరవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈడీ నోటీసులు రావడంతో ఏం చేస్తారనేది చూడాలి.
తప్పించుకుంటున్న కేజ్రీవాల్
మరో వైపు ఇదే కేసులో ఈడీ నోటీసులు ఇస్తున్నప్పటికీ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పించుకుంటున్నారు. ఇప్పటికి 5 సార్లు ఆయనకు నోటీసులు పంపించారు. అయితే.. ఇదంతా ఎన్నికలకు ముందు ఉద్దేశ పూర్వకంగా తమను ఇబ్బంది పెట్టాలనే వ్యూహంతోనే మోడీ సర్కారు ఇలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత కూడా ఇలానే వ్యాఖ్యానిస్తారా? లేక హాజరవుతారా? అనేది చూడాలి. మరోవైపు.. కేసీఆర్ డిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి ముందు ఇలా నోటీసులు రావడం కూడా.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
This post was last modified on February 22, 2024 12:37 am
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…