ఇటీవల ఇండియా టుడే సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే చేపట్టగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా తొలి స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్ పాపులారిటీ రేటింగ్ 52.7 శాతం. 51.3 శాతం పాపులారిటీ రేటింగ్‌తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ 48.6 శాతం రేటింగ్‌ను పొందగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 42.6 శాతం రేటింగ్‌తో నాల్గవ స్థానాన్ని ఆక్రమించారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 41.4 శాతం ప్రశంసనీయమైన పాపులారిటీ రేటింగ్‌ను సాధించి, ఐదవ స్థానాన్ని సంపాదించారు.
సర్వే ఫలితాలను అనుసరించి, త్రిపుర ప్రజలు ముఖ్యమంత్రి మ్నాయక్ సాహా అంకితభావం, సరళత, ఆయన నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రజలు కొనియాడారు. సిఎం సాహా చాలా నిజాయితీపరుడు, ఎల్లప్పుడూ అట్టడుగు స్థాయిలో పనిచేస్తారని స్థానికులు తెలిపారు ఏ రకమైన సమస్యనైనా పరిష్కరించడానికి అతను ఎల్లప్పుడూ ఉంటాడని అన్నారు. “ముఖ్యమంత్రి మాణిక్ సాహా నాయకత్వంలో మేము చాలా మంచి స్థితిలో ఉన్నాము. ఆయన మార్గదర్శకత్వంలో, త్రిపురలో ప్రతి ఒక్కరూ క్రమంగా అభివృద్ధి చెందుతున్నారు” అని తెలిపారు.
ఇక, బిజూ జనతా దళ్ నేత నవీన్ పట్నాయక్ 22 ఏళ్లుగా ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రానికి 22వ ముఖ్యమంత్రి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఇటీవల అయోధ్య రామమందిర నిర్మాణంతో ఆయన పేరు మార్మోగుతోంది. అయితే.. ఈ జాబితాలో సీఎం జగన్ పేరు కనిపించకపోవడం గమనార్హం.
This post was last modified on February 18, 2024 10:50 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…