పార్టీలోని ప్రత్యర్ధులకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లేనా ? తాజా డెవలప్మెంట్లు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతు మరో పదేళ్ళ పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తంచేశారు. అంటే మొత్తం 20 ఏళ్ళపాటు తానే ముఖ్యమంత్రిగా ఉండాలని రేవంత్ బలంగా కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. నిజానికి బతికున్నంత కాలం తామే పదవుల్లో ఉండాలని కోరుకోని నేతలు ఎదరూ ఉండరు.
ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేదే పదవుల కోసం. ప్రజాసేవని చెప్పటం కేవలం పడికట్టు పదం మాత్రమే. ఈ విషయం చెప్పేవారికీ తెలుసు, ఓట్లేసే జనాలకు కూడా బాగా తెలుసు. ఇపుడు విషయం ఏమిటంటే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని రేవంత్ కోరుకోవటం పార్టీలో పెద్ద చర్చయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎంతకాలం పదవుల్లో ఉంటారో అధిష్టానం మీద ఆధారపడుంటుంది. ఎంతటి బలవంతుడైన నేతయినా అధిష్టానం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే తప్ప వేరే దారిలేదు.
అసలు రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీయే విచిత్రంగా జరిగింది. టీడీపీలో ఉన్నపుడు కాంగ్రెస్ ను నూరుశాతం వ్యతిరేకించిన రేవంత్ చివరకు అదే కాంగ్రెస్ లో చేరక తప్పలేదు. పార్టీలోకి రేవంత్ ను చేర్చుకోవటాన్ని చాలామంది సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే తెరవెనుక జరిగిన లాబీయింగ్ కారణంగా రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. అప్పటినుండి ప్రతి విషయంలోను ప్రతి అడుగులోను రేవంత్ ను సీనియర్లు వ్యతిరేకిస్తునే ఉన్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి ప్రెసిడెంట్ అయినపుడు కూడా సీనియర్ల అలాగే వ్యతిరేకించారు. చివరకు ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. అంటే రేవంత్ కు అడుగడుగునా సీనియర్ల నుండి ఏ స్ధాయిలో వ్యతిరేకత ఎదురవుతున్నదో అర్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పడి కొత్త కాబట్టి సీనియర్లు మౌనంగా ఉన్నారు. మంత్రివర్గంలోని సీనియర్లలో దాదాపు తొమ్మిది మంది నూరుశాతం వ్యతిరేకులే అనటంలో సందేహంలేదు. ఇలాంటి స్ధితిలో రాబోయే 20 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తాను ఉన్నంత వరకు సీఎం పోస్టు మీద ఆశలు వదులుకోమని సీనియర్లకు వార్నింగ్ ఇచ్చినట్లేనా ?
This post was last modified on February 15, 2024 11:54 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…