రాబోయే ఎన్నికల్లో కొందరు సీనియర్ తమ్ముళ్ళకి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో సూపర్ సీనియర్ల కుటుంబాల్లో ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు చెప్పేశారు. సీనియర్ తమ్ముళ్ళు చింతకాయల, జేసీ, పరిటాల, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలు రెండు టికెట్ల కోసం బాగా ప్రయత్నిస్తున్నారు. జనసేనతో పొత్తులోనే టీడీపీ పోటీచేయబోయే సీట్లు తగ్గిపోతున్నాయి. తాజా డెవలప్మెంట్లలో బీజేపీ కూడా చేరుతుందనే అంటున్నారు. ఒకవేళ కమలంపార్టీ కూడా పొత్తులో చేయికలిపితే టీడీపీ పోటీచేయబోయే సీట్లు మరిన్ని తగ్గిపోతాయి.
ఒకవైపు పోటీచేయబోయే సీట్లు తగ్గిపోతుండగా మరోవైపు సీనియర్ నేతలు కుటుంబానికి రెండు టికెట్లు తీసుకుంటే మిగిలిన నేతల్లో అసంతృప్తి తప్పదని చంద్రబాబు గ్రహించారు. అందుకనే సూపర్ సీనియర్ తమ్ముళ్ళ కుటుంబాల్లో ఒక్క టికెట్ మాత్రమే ఇస్తానని చెప్పేశారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం అసెంబ్లీకి, కొడుకు చింతకాలయ విజయ్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ అడుగుతున్నారు. పరిటాల సునీత రాప్తాడులోను కొడుకు శ్రీరామ్ కు ధర్మవరంలోను టికెట్ కావాలని పట్టుబడుతున్నారు.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనకు కర్నూలు ఎంపీగాను, భార్య సుజాతమ్మకు ఆలూరు ఎంఎల్ఏగా టికెట్ అడుగుతున్నారు. పోయిన ఎన్నికల్లో వీళ్ళిద్దరు పై స్ధానాల్లో పోటీచేసి ఓడిపోయారు. కేఈ ప్రతాప్ లేదా కేఈ ప్రభాకర్ డోన్ అసెంబ్లీ టికెట్ తో పాటు కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యాంబాబు పత్తికొండ సీటును ఆశిస్తున్నారు. అలాగే పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం ఎంఎల్ఏగా, కూతురు అదితికి విజయనగరం ఎంఎల్ఏగా టికెట్లు కేటాయించాలని అడుగుతున్నారు. జేపీ కుటుంబంలో జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎంఎల్ఏ టికెట్లు కావాలని పట్టుబడుతున్నారు.
ఇన్ని కుటుంబాలకు రెండేసి టికెట్లిస్తే మిగిలిన నేతలు ఊరుకోరని చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అందుకనే ముందుజాగ్రత్తగా శనివారం సమావేశంలో కుటుంబానికి ఒక్క టికెట్టే అని కచ్చితంగా చెప్పేశారట. మరి మిగిలిన సీట్లను ఇతర సీనియర్లకు కేటాయిస్తారా లేకపోతే పొత్తులో జనసేన, బీజేపీలకు ఇచ్చేస్తారా అన్నది సస్పెన్సుగా మారింది. చివరకు ఏమిచేస్తారో చూడాలి.
This post was last modified on February 11, 2024 12:58 pm
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…