వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్ట కీలక నాయకుడు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న మహీధర్ రెడ్డి.. అనేక పర్యాయాలు కందుకూరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. పాతతరం నాయకుల్లో ఆయన ఒకరు. గతంలో మర్రి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నాయకుల్లో వివాద రహిత నాయకుడిగా మానుగుంటకు మంచి పేరుంది.
కందుకూరు నుంచి 1989, 2004, 2009, 2019లో విజయాలు దక్కించుకున్న మహీధర్‌రెడ్డి జగన్ హయాంలో ఆయన వెంటే నడిచారు. మంత్రి పదవిని ఆశించారు. అయితే.. మంత్రి పదవి దక్కలేదు. అయినప్పటి కీ.. సీఎం జగన్ పై అభిమానంతో ఆయన పార్టీలోనే ఉన్నారు. ప్రజలకు చేరువ కావడంలో ఆయన స్టయిల్ వేరు! అనే మాట తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన కు టికెట్ లేదనే సంకేతాలు వెళ్లాయి. కొన్నాళ్లు ఆయన సీఎం జగన్‌ను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం దక్కలేదు.
దీంతో హర్ట్ అయిన మానుగుంట.. పార్టీ మార్పునకు శ్రీకారం చుట్టారు. వైఎస్‌కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన మానుగుంట.. కొన్నాళ్ల కిందట.. జగన్ ఎలంటి నిర్ణయం తీసుకుంటానన్నా ఓకే చెబుతానని అన్నారు. అయితే.. తన ప్రత్యర్థికి టికెట్ ఇస్తున్నట్టు తెలియడంతో ఆయన తన దారి తాను చూసుకుం టున్నారని తెలుస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సూచలన మేరకు.. ఆ పార్టీ యువ నాయకు డు నారా లోకేష్‌తో మానుగుంట భేటీ అయ్యారని సమాచారం.
నారా లోకేష్ తో భేటీ అనంతరం.. తన అభిప్రాయాన్ని మీడియాకు చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనా.. కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపీ చేజేతులా ఇలాంటి వారిని దూరం చేసుకోవడం.. ఇబ్బందేనని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on February 7, 2024 1:42 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…