గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఎప్పుడూ.. ఆ పార్టీ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేసింది లేదు. పైగా బాధపడిందీ లేదు. మాజీ మంత్రులు కేటీఆర్ నుంచి హరీష్‌రావు వరకు అందరూ.. పెద్దగా దీనిపై స్పందించింది ఎప్పుడూ లేదు. కేవలం స్పీడు బ్రేకులు మాత్రమే పడ్డాయని వ్యాఖ్యానించారు. అదే క్రమంలో తాజాగా మరోసారి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిర్విరామంగా 24 ఏళ్లుగా పనిచేసిన కారుకు ఇప్పుడు చిన్నపాటి సర్వీసింగ్ మాత్రమే వచ్చిందన్నారు.
కారు తిరిగి పుంజుకుంటుందని.. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 14 నియోజ కవర్గాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులు కేవలం స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయారని వ్యాఖ్యానించారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే తమకు తక్కువ పోల య్యాయని చెప్పారు. తామేమీ నిరాశ చెందడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎలా విజయం దక్కించుకోవాలన్న విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయం తమదేనని అన్నారు.
“ఆయన మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారు” అని సీఎం రేవంత్ పై కేటీఆర్ సటైర్లు వేశారు. “మాణిక్కం ఠాకూరుకు 50 కోట్లు ఇచ్చి… మేనేజ్‌మెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యాడని అనుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు. తమ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని.. ఆరోపణలు కాదు.. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కాబట్టి.. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సవాల్ రువ్వారు. 39 ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామన్న కేటీఆర్.. పోయింది అధికారం మాత్రమేనని పోరాట పటిమ కాదని అన్నారు.
This post was last modified on January 28, 2024 9:46 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…