ఒకప్పుడు ఆ దేశంలో రోజుకు ఇన్ని కేసులట.. ఈ దేశంలో ఒకే రోజు ఇన్ని మరణాలట అని చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మన గురించి ఆందోళనకరమైన వార్తలు ప్రపంచం చెప్పుకుంటోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
ఈ ఉద్ధృతి ఎప్పుడు ఆగుతుందో ఏమో తెలియట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మొత్తంగా దేశం పరిస్థితి చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. తాజాగా భారత్ కరోనా వ్యాప్తిలో మరింత ఆందోళనకర స్థాయికి చేరుకుంది.
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో కొన్ని రోజుల కిందటే మూడో స్థానానికి చేరుకున్న భారత్.. ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకింది. బ్రెజిల్ (41.23 లక్షల కేసులు) ను వెనక్కి ఇండియా రెండో స్థానానికి చేరుకుంది.
భారత్‌లో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 41.97 లక్షలు. మరణాల సంఖ్య 71 వేల మార్కును దాటేసింది. బ్రెజిల్‌తో పోలిస్తే ఇండియా జనాభా చాలా ఎక్కువే. కానీ ఆ దేశంతో పోలిస్తే మన దగ్గర చేస్తున్న కరోనా పరీక్షల సంఖ్య తక్కువ. అయినా సరే.. బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి చేరింది భారత్.
ప్రస్తుతం ఒక్క అమెరికా మాత్రమే భారత్ కంటే ముందుంది. ఆ దేశంలో 64.45 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న టాప్-10 దేశాల్లో అతి తక్కువగా కరోనా పరీక్షలు చేస్తున్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానం.
ఇక ఒక్క రోజు వ్యవధిలో 90 వేలకు పైగా కేసులతో భారత్.. 24 కేసుల్లో అత్యధిక కేసులు బయటపడ్డ దేశంగా ప్రపంచ రికార్డు నెలకొల్పడం గమనార్హం.
This post was last modified on September 7, 2020 8:50 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…