Political News

ఐదు వ్యూహాల‌తో ఎన్నిక‌ల‌కు వైసీపీ.. ‘సిద్ధం’

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఐదు వ్యూహాల‌తో రెడీ అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు పార్టీ ‘సిద్ధం’ పేరుతో ఎన్నిక‌ల యుద్ధంలోకి అడుగు పెట్టింది. ఈ క్ర‌మంలో ఈ ఐదు వ్యూహాల‌ను పార్టీ ప్ర‌క‌టించింది. సీఎం జ‌గ‌న్‌ ‘సిద్ధం’ పేరుతో తన మొదటి అధికారిక రాజకీయ ప్రచారానికి విశాఖ‌లో శ్రీకారం చుట్టారు. ఇక‌, నుంచి ఈ స‌భ‌లు రాష్ట్ర వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి సీఎం జగన్ తో పాటు కార్యకర్తలు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేలా వ్యూహ ర‌చ‌న చేశారు.

వ్యూహాలు ఇవీ..

  • మీడియా, సోషల్ మీడియాలో ఈవెంట్ పై సందడి సృష్టించేందుకు, పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అనేక హోర్డింగ్‌లు, బ్యానర్‌లను “సిద్ధం” అనే టైటిల్‌తో పెట్టింది. ఎలాంటి సవాల్ వచ్చినా స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారనే సందేశాన్ని వీటి ద్వారా ప్ర‌తిప‌క్షాల‌కు పంపించారు.
  • ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ గీతాల‌కు ప్రాధాన్యం ఉంటుంది. అలానే వైసీపీ కూడా సిద్ధం పేరుతో సోషల్ మీడియాలో ‘ఓ వైసీపీ కార్యకర్తలారా’ అనే ప్రత్యేక పాటను విడుదల చేసింది. ఇది ప్రత్యేకంగా సిద్దం ప్రచారం కోసం రూపొందించిన పాట.
  • ఎక్కడ సిద్ధం స‌భ జ‌రిగినా స‌భ‌లో క్యాడర్‌కు అతి దగ్గరగా వెళ్లి మాట్లాడేందుకు ర్యాంప్ ను ఏర్పాటు చేస్తారు. తాజాగా విశాఖ‌లో స‌భ‌కు కూడా ర్యాంపును ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌ క్యాడర్‌ దగ్గరకు స్వయంగా వెళ్లి మాట్లాడేందుకు, క్యాడర్ కు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ఈ ర్యాంప్‌ను రూపొందించారు.
  • వైసీపీ పార్టీ క్యాడర్ మణికట్టుపై సిరా వేసినట్లు ప్ర‌త్యేక స్టాంపు వేస్తారు. ఇది పార్టీ పట్ల వారి విధేయత, మద్దతును తెలియజేస్తుంది.
  • ప్రతిపక్ష నేతల వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేస్తూ.. ఏక‌కాలంలో కీలక సందేశం పంపేలా ప్రత్యేక గేమ్‌ను రూపొందిచారు.

This post was last modified on January 27, 2024 7:12 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

10 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

1 hour ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

1 hour ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago