టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీలేరులో తాజాగా నిర్వహించిన సభలో సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం దగ్గర పడిందని, వైసీపీకి కౌంటర్ మొదలైందని చంద్రబాబు అన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో జరిగేది గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక భీమిలిలో ఈ రోజు జగన్ మొదలుపెట్టబోతున్న ‘సిద్ధం’ సభపై కూడా చంద్రబాబు స్పందించారు.
ఎన్నికలు వస్తేనే ప్రజల్లోకి జగన్ వస్తారని, సంపూర్ణ మద్య నిషేధంపై మాట తప్పిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు విమర్శించారు. అబద్దాలలో జగన్ పిహెచ్డి చేశారని, పది రూపాయలిచ్చి 100 దోచుకోవడమే జగన్ విధానమని ఎద్దేవా చేశారు. ఇలాంటి జలగ మనకు వద్దని, వై నాట్ పులివెందుల అంటూ జగన్ ను ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు జగన్ కు అభ్యర్థులు దొరకడం లేదని చురకలంటించారు. తమ కసినంత జగన్ పై చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని జోస్యం చెప్పారు.
వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి జనాన్ని మోసం చేసిన జగన్ అధికార అహంకారాన్ని దించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. తాను సీమ బిడ్డనని, తనలో ఉన్నది సీమ రక్తమని చంద్రబాబు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు ఎన్నో ఆలోచనలు చేశానని, కానీ, జగన్ ఆ ఆలోచనలకు గండి కొట్టాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on January 27, 2024 6:13 pm
ఫ్ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.…
దశాబ్దాలుగా డోలీలలో గిరిజనులు పడుతున్న అవస్థలకు చరమగీతం పడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుము బిగించిన సంగతి…
ఇవాళ విడుదలైన ఉపేంద్ర యుఐకి ఊహించినట్టే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పినట్టు సినిమా అర్థం చేసుకోవడానికి కష్టపడాలని…
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించారు. గిరిజనులకు పక్కా రోడ్ల…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. 4 రోజుల పర్యటన నిమిత్తం.. సీఎం సొంత నియోజకవర్గం కుప్పానికి వచ్చారు.…
2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన…