ఏపీ సీఎం జగన్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. గత రెండు రోజులుగా ఆమె పర్య టనలు చేస్తూ.. వైసీపీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ సానుభూతి ఓటు బ్యాంకును కార్నర్ చేసుకుని షర్మిల దూకుడుగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సింపతీ సహా ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అధికార పార్టీ వైసీపీకీ ఆయువుపట్టుగా ఉంది. దీనిపైనే షర్మిల ఇప్పుడు టార్గెట్ చేశారు.
తాజాగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్(అంటే.. రాజశేఖరరెడ్డి) లేరని, కేవలం ఆయన పేరు మాత్రమే ఉందని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌కు కొత్త అర్థం చెప్పారు. వై-అంటే.. వైవీ సుబ్బారెడ్డి, ఎస్-అంటే విజయ సాయిరెడ్డి, ఆర్ – అంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి.. అని వ్యాఖ్యానించారు. వీరే వైసీపీని నడిపిస్తున్నారని అన్నారు. “ఇది.. జగన్ ‘రెడ్డి’ పార్టీ, నియంత పార్టీ, ప్రజలను పట్టించుకోని పార్టీ” అని షర్మిల విమర్శలతో ముంచెత్తారు.
ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టి.. బీజేపీకి బానిసగా వ్యవహరిస్తున్న పార్టీ అంటూ వైసీపీపై షర్మిల విమ ర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క ఆశయాన్నయినా.. వైసీపీ నాయకులు తీర్చారా? అని ప్రశ్నిం చారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన షర్మిల.. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వైసీపీని నిలబెట్టడం కోసం తన రక్తం ధారపోశానని షర్మిల అన్నారు.
గతం మరిచిన వైసీపీ నేతలు ఇప్పుడు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదని తేల్చి చెప్పారు. కాగా, “నేను యుద్ధానికి రెడీ… మీరు రెడీనా..?” అని వైసీపీకి షర్మిల సవాల్ రువ్వారు.
This post was last modified on January 27, 2024 3:58 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…