రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతానని.. విశ్వసనీయతకు, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తానని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. గతం మరిచినట్టుగా ఉన్నారే! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా.. రాజకీయాల్లో ఉన్నవారు గతాన్ని మరిచిపోయి మాట్లాడుతూ ఉంటారు. అవకాశం-అవసరం.. అనే రెండు పట్టాలపైనే వారు ప్రయాణిస్తుంటారు. ఎప్పుడో మూడు నాలుగు దశాబ్దాల కిందటి రాజకీయాలు.. ఇప్పటి రాజకీయాలు వేరు. అప్పట్లో అంకిత భావం ఉండేది. అవసరం తక్కువగా ఉండేది.
కానీ, ఇప్పుడు అవసరం, అవకాశం అనే రెండే రాజకీయాలకు ప్రాతిపదికగా మారిపోయాయి. అయితే.. వీటిని మారుస్తానని, తను రాజకీయాల్లో విశ్వసనీయంగా ఉంటానని చెప్పుకొచ్చిన షర్మిల.. ప్రస్తుత రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తానని కూడా అన్నారు. అయితే.. ఆమె అడుగులు, ఆమె మాటలు పరిశీలిస్తే.. మాత్రం ఏమాత్రం ఇలాంటి లక్షణాలు కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఖచ్చితంగా ఓ ఐదేళ్ల కిందటి పరిస్థితికి వెళ్లినా.. గత ఏడాది తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపక ముందునాటి పరిస్థితిని చూసినా.. షర్మిల ఏం చెప్పారో.. ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి ఏమన్నారో తెలుస్తుంది.
అంతేకాదు.. ప్రస్తుతం ఆమె ఎవరిపై అయితే.. కారాలు మిరియాలు నూరుతున్నారో.. ఆ అన్న, ఏపీ సీఎం జగన్ కోసం.. పాదయాత్ర చేసినప్పుడు.. ఇదే కాంగ్రెస్ పార్టీ, టీడీపీలపై ఆమె చేసిన విమర్శలు.. ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుస్తుంది. ఏపీని విభజించిన కాంగ్రెస్‌పై వైఎస్ జీవించి ఉండి ఉంటే.. ఉమ్మేసేవారని వ్యాఖ్యానించిన షర్మిల.. ఇప్పుడు అదే పార్టీ తరఫున యాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు మిళితమై.. జగన్‌పై సీబీఐని ఉసిగొలిపి కేసులు పెట్టించాయని.. 2019కి ముందు ఇదే నోటితో చెప్పిన షర్మిల.. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నారు.
వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం.. వైసీపీ కోసం షర్మిల తిరిగినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ఒక బూచి. అది కూడా.. తన కుటుంబాన్ని, తన తండ్రిని కూడా అవమానించారంటూ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. సీబీఐ కేసులు పెట్టించారని, తన తండ్రిని అవమానించారని.. తన తండ్రి చనిపోయినా కూడా వదిలిపెట్టుకుండా.. కేసుల్లో పేరు చేర్చారని.. ఆనాడు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు షర్మిల. టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు జట్టుకట్టి.. తన అన్నను జైలుకు పంపించారని కూడా వెల్లడించారు. కట్ చేస్తే.. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా మారిపోయిందా? అనేది షర్మిల చెప్పాలి.
ఎందుకంటే.. ఇప్పుడు అదే పార్టీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమె టోన్ మారిపోయింది. ఒకప్పుడు దెయ్యమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేవుడిగా మారిపోయింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తానని.. తన తండ్రి సానుభూతిని కాంగ్రెస్‌కు చేరువ చేస్తానని చెబుతూ.. షర్మిల ఊరూ వాడా ప్రచారానికి రెడీ అయ్యారు. మరి ఇదేం విశ్వసనీయత? ఇదేం రాజకీయమో.. షర్మిలే చెప్పాలి.
రేవంత్‌పైనా..
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌ను సైతం షర్మిల వదిలి పెట్టలేదు. తెలంగాణలో తన పార్టీ వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయకముందు.. ఆమె.. రేవంత్‌పైనా విరుచుకుపడ్డారు. రేవంత్ ఎక్స్‌ట్రార్టనిస్ట్, బ్లాక్‌మెయిలర్ అంటూ మీడియా ముఖంగానే విమర్శించారు షర్మిల. కానీ, తర్వాత.. పార్టీని విలీనం చేశాక.. ఆయన కూడా ఆమెకు మంచి వారుగా కనిపిస్తున్నారంటే.. ఇంతకన్నా షర్మిల రాజకీయాన్ని ఏమనాలి. ఇవన్నీ.. ఎవరూ గమనించడం లేదని.. తాను చేస్తున్నదే కరెక్ట్ అని ఆమె అనుకుంటే.. పొరపాటు. ప్రతి విషయాన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా సమాధానం చెబుతారో అప్పుడు వారి స్పందన షర్మిలకు ఓ రేంజ్‌లో తెలియమానదు.
This post was last modified on January 24, 2024 11:44 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…