వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒకవైపు అదికార పార్టీ వైసీపీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అభ్యర్థులను ప్రజల నాడికి.. సర్వేల సమాచారానికి అనుకూలంగా మారుస్తోంది. ఈ క్రమంలో చిన్నపాటి వ్యతిరేకతలు వచ్చినా.. పార్టీ ప్రజల ననాడికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటోంది. ఎక్కడా ఎవరి డిమాండ్లకు తలవంచే పరిస్థితి లేకుండా ముందుకు సాగుతోంది. మరి ఇదే పరిస్థితి టీడీపీలో లేదు. ఎటు చూసుకున్నా అందరూ సీనియర్లే. పైగా.. నియోజకవర్గాల్లో తిష్టవేశారు కూడా.
ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. అభ్యర్థుల జాబితాలు ప్రకటించే విషయంలో ఇలాంటి సమస్యలే టీడీపీకి ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఒక నియోజకవర్గంలో పొరుగు పార్టీ నేతను చేర్చుకుని, టికెట్ ఇచ్చే విషయం రాజకీయంగా దుమారం రేపేందుకు రెడీగా ఉంది. మరోవైపు జనసేన మిత్రపక్షంగా ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలను ప్రకటించడం.. రాజకీయ కాకకు సిద్ధంగా ఉంది. వెరసి ఇలా టీడీపీకి ముందు-వెనుక కూడా ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
ఇంకో వైపు.. ఒక కుటుంబానికి ఒక టికెట్ అని ప్రకటించిన చంద్రబాబు కొన్ని కుటుంబాలకు మినహాయింపు ఇచ్చి.. మరికొన్ని కుటుంబాలకు మాత్రం రెండేసి మూడేసి టికెట్లు ఇచ్చేందుకు సిద్ధం కావడం కూడా రాజకీయ దుమారానికి దారి తీసే పరిస్థితి ఏర్పడింది. గతంలో 2022 మహానాడు నాడు.. 33 శాతం సీట్లను యువతకు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనిని ఆయన మరిచిపోయినా.. పార్టీలో సేవ చేస్తున్నవారు మాత్రం గుర్తు పెట్టుకున్నారు. దీంతో వారి పరిస్థితి ఏంటనేది కూడా ఆసక్తిగా మారింది.
ఎలా చూసుకున్నా.. మరో వారమో లేదా రెండు వారాల్లోనో.. టీడీపీ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే.. ఇది వివాదం కాకుండా ఉండాలంటే.. ముందుగానే నాయకులను బుజ్జగించడం.. వారి పరిస్తితిని వివరించడం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొంత వరకు మేలు జరుగుతుందనే వాదన ఉంది. పైగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు గతంలోనే ఇంచార్జ్‌లుగా కొందరిని నియమించారు. మరివారి పరిస్థితి ఏంటనేది కూడా చర్చగా మారింది. ఎలా చూసుకున్నా.. బాబు ముందుగానే ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తే.. తలనొప్పు తగ్గుతాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 22, 2024 10:22 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…