దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సంక్రాంతి వేడుకలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రఘురామను పలువురు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారితో రఘురామ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వర్తమాన రాజకీయాలపై, ఏపీలోని రాజకీయ పరిస్థితులపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందని రఘురామ అన్నారు.
పార్లమెంటు సమావేశాల తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇక, వైసీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎఫెక్ట్ ఉంటుందని రఘురామ అన్నారు. వైసీపీ ఓట్లలో 5-7 శాతం కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు కేసులో కీలకంగా మారిన సెక్షన్ 17 17 ఏ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాక్షి పత్రికలో వక్రీకరికరించారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనే దీనిపై విచారణ జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 135 నుంచి 150 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైసీపీని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలలోను వైసీపీపై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని చెప్పారు. కాగా, హైకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు ఏపీ పోలీసులు రక్షణ కల్పించడంతో ఆయన తన సొంత ఊరు భీమవరంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 17, 2024 8:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…