Political News

చంద్రబాబు కేసులో సుప్రీం కీలక తీర్పు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ అధికారులు కొద్ది నెలల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్న చంద్రబాబు ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే తన అరెస్టు సమయంలో సెక్షన్ 17ఏ పాటించలేదని, తన ఎఫ్ ఐఆర్ ను క్వాష్ చేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది.

ఈ క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జడ్జిలు అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ వేర్వేరుగా తీర్పు వెల్లడించారు. అంతేకాదు, ఈ కేసు విచారణను త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని డివిజనల్ బెంచ్ విజ్ఞప్తి చేసింది. దీంతో, స్కిల్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా లేదా అన్న వ్యవహారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం దగ్గరకు చేరింది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17  ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే తనను అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు, ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, గత ఏడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు ఆ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో, ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆ క్వాష్ పిటిషన్ కొట్టివేత తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై ఈ రోజు డివిజనల్ బెంచ్ తీర్పునిచ్చింది.

This post was last modified on January 16, 2024 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్ ఎఫెక్ట్‌: 2 వేల లీట‌ర్ల డీజిల్‌.. 2 కోట్ల ఖ‌ర్చు.. నీళ్లు తోడుతున్నారు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజ‌ధానుల పేరుతో ఆయ‌న న‌వ్యాంధ్ర…

17 seconds ago

ముర‌ళీమోహ‌న్ అంత‌రంగం.. అయితే, అదే పెద్ద స‌మ‌స్య‌!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌, వ్యాపార వేత్త ముర‌ళీమోహ‌న్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…

2 hours ago

ఆ రోజుల్లో… శ్రీవారు క‌నిపించేది సెక‌నంటే సెక‌నే!!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఓ 2 నిమిషాలు ల‌భిస్తుంద‌ని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్న‌గారు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా…

3 hours ago

బ్రేకింగ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…

4 hours ago

అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…

6 hours ago