టీడీపీలో ఒకటి కాదు.. రెండు టికెట్‌లు కోరుకునేవారు పెరుగుతున్నారు. వీరిలో ఒకే కుటుంబం నుంచి తల్లీ కుమారులు, తండ్రీ కూతుళ్లు, అన్నదమ్ములు కూడా ఉండడం గమనార్హం. చివరకు ఇది చంద్రబాబుకు మొహమాటాల చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం సహా.. ధర్మవరం నియోజకవర్గాన్ని పరిటాల కుటుంబం ఆశిస్తోంది. పరిటాల రవి వారసుడిగా 2019 ఎన్నికల సమయంలో తెరమీదికి వచ్చిన.. శ్రీరామ్.. మరోసారి తన అదృష్టం పరిశీలించుకునేందుకు రెడీ అయ్యారు.
ఇక, పరిటాల రవి సతీమణి.. సునీత కూడా ఈ దఫా పోటీకి సై అంటున్నారు. అంతేకాదు.. ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వాలని ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుకు రిక్వెస్టు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తానే తప్పుకొంటానని.. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని ఆమె అభ్యర్థిస్తున్నారు. ఇక, రవి వరసుడిగా ఉన్న శ్రీరాం.. ఈ దఫా గెలిచి తీరుతానని.. కాబట్టి.. ఈసారి మిస్ కాకుండా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నా రు. రాప్తాడును తన మాతృమూర్తి సునీతకు కేటాయించాలని.. ధర్మవరం టికెట్‌ను తనకు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.
ఇదే విషయాన్ని సునీత కూడా చంద్రబాబుకు చెబుతున్నారు. మొత్తానికి పరిటాల కుటుంబం చంద్రబా బును తీవ్రస్థాయిలో మొహమాట పెట్టేస్తోందని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే పరిటాల కుటుంబంపై అధ్యయనం చేయించిన చంద్రబాబు.. ఒక్కసీటుకే పరిమితం కావాలని.. గత ఆరు మాసాల ముందుగానే చెప్పారు. రాప్తాడు లేదా.. ధర్మవరం ఏదో ఒకటి ఎంచుకుని అక్కడ నుంచే పోటీ చేయాలని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, తల్లికుమారుడు మాత్రం రెండు కోసం పట్టుబడుతున్నారు.
ఇదిలావుంటే.. శ్రీరాం.. ఈ విషయంలో పట్టు విడిచిపెట్టే పరిస్థితిలో కనిపించడం లేదు. ధర్మవరంలో సభలు పెడుతున్నారు. టీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న వరదాపురం సూరి (గోనుగుం డ్ల సూర్యనారాయణ)కు సవాళ్లు సైతం రువ్వుతున్నారు. నియోజకవర్గంలోకి ఎలా అడుగు పెడతారని.. టీడీపీ టికెట్ ఎలా ఆశిస్తారని.. ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక, రాప్తాడులో పరిటాల సునీత పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు. దీంతో ఈ ఇద్దరి విషయం రెండు నియోజకవర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.
This post was last modified on January 16, 2024 10:44 am
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…