వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, జాతీయ స్థాయిలో ఏఐసీసీ సభ్యురారిగా ఏదో ఒక హోదాలో ఆమెను నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాను అధిష్టానం అప్పగించిన బాధ్యతను అండమాన్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోంది.
తన పదవికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తాజాగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన పంపించారు. మణిపూర్ లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాబోయే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఏపీలో బలోపేతం చేసేందుకు షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును కాంగ్రెస్ పెద్దలు నియమించిన సంగతి తెలిసిందే. సునీల్, షర్మిలల కాంబినేషన్లో ఏపీలో పార్టీకి పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఏది ఏమైనా షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమిస్తే వైసీపీ చిక్కులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on January 15, 2024 11:24 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…