వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేనకు ఇచ్చే సీట్ల విషయాన్ని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలిసింది. మొత్తం 175 స్థానాల అసెంబ్లీలో 15 స్థానాలను జనసేనకు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై సుదీర్ఘంగా శనివారం రాత్రంగా జరిగిన చర్చల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్టు సమాచారం. అదేవిధంగా రెండు పార్లమెంటు స్థానాలను కూడా.. జనసేనకు కేటాయించినట్టు తెలిసింది.
అదేవిధంగా జంపింగుల విషయం కూడా ఇరు పార్టీల నేతల మధ్య చర్చకు వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వైసీపీలో టికెట్లు దక్కని ఇద్దరు కీలక నాయకులు జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణయాదవ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయనకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి వచ్చిన ఎంపీ బాలశౌరి త్వరలోనే జనసేన పార్టీ తీర్థం తీసుకోనున్నారు.
ఈ నేపథ్యంలో మచిలీపట్నం టికెట్‌ను కూడా జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఈ రెండు స్థానాలతోపాటు.. పిఠాపురం, విజయవాడ వెస్ట్, చీరాల, దర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూరల్, తిరుపతి, మాడుగుల, పోలవరం, పెడన, నంద్యాల, అనంతపురం రూరల్, ధర్మవరం, కళ్యాణదుర్గం, పూతలపట్టు వంటి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు దాదాపు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో మచిలీపట్నం కేటాయించారు.
మరో పార్లమెంటు నియోజకవర్గంపై కసరత్తు చేసిన తర్వాత.. కేటాయిస్తామని చెప్పినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల వివాదాలు రాకుండా.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయకుండా.. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని.. అడుగులు వేయాలని ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించారు. ముఖ్యంగా పొత్తులు దెబ్బతినకుండా చూసుకోవాలని నిర్ణయించారు. బీజేపీ కలిసి వస్తే.. అప్పుడు చూడాలని.. లేకపోతే.. కమ్యూనిస్టులను కలుపుకొని ముందుకు వెళ్లాలని తాజా చర్చల్లో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
This post was last modified on January 14, 2024 10:06 am
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…