స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 50 రోజులపాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. అయితే, చంద్రబాబు అరెస్టు సమయంలో సెక్షన్ 17 ఏ ఆయనకు వర్తిస్తుందా లేదా అన్నదానిపై ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా వాడివేడి వాదనలు జరిగాయి.
ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరు 20న ఇరుపక్షాల తుది వాదనలు విన్న సుప్రీం కోర్టు సెక్షన్ 17ఏ, క్వాష్ పిటిషన్ పై తుది తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనవరి 16వ తేదీన ఈ వ్యవహారం పై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తన అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. 17 ఏ సెక్షన్ తనకు వర్తిస్తుందని, దానిని పాటించకుండానే అరెస్టు చేయడం సరికాదని ఆయన పిటిషన్ వేశారు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే, చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తించదని ఏపీ సిఐడి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 20న వాదనలు పూర్తయి తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16న జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ కేసులో ఎటువంటి తీర్పు రాబోతుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
This post was last modified on January 14, 2024 2:02 am
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…