ఈనెలాఖరులో క్యాబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రేవంత్ కాకుండా 11మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అంటే మరో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశముంది. ఇపుడున్న మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీల నుండి ప్రాతినిద్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తరపున పోటీచేసిన మైనారిటి నేతలంతా ఓడిపోయారు కాబట్టే. ఓడిపోయిన వారిలో షబ్బీర్ ఆలీ, మహ్మడ్ అజహరుద్దీన్ ముఖ్యులు.
అందుకనే మంత్రివర్గాన్ని విస్తరించి మైనారిటిల నుండి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వాలని రేవంత్ అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యులకు చెబితే వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈమధ్య తరచూ ఢిల్లీకి వెళుతున్న రేవంత్ మంత్రవర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. అలాగే ఎవరెవరిని తీసుకోవాలనే విషయాన్ని కూడా చర్చించినట్లు పార్టీవర్గాల సమాచారం. కాకపోతే కొన్ని పేర్లు విషయంలో ఇటు రేవంత్ అంటు ఐఏసీసీ ఏకాబిప్రాయానికి రాలేదట.
మైనారిటీలను మంత్రివర్గంలోకి తీసుకోవటం వరకు ఓకేనే. కానీ ఎవరిని తీసుకోవాలన్నదే సమస్యగా మారింది. ఎందుకంటే షబ్బీర్ లేదా అజహరుద్దీన్ లో ఒకళ్ళని తీసుకోవాలని రేవంత్ అనుకుంటున్నారట. అయితే ఓడిపోయిన వాళ్ళకి ఎంఎల్సీలు ఇవ్వకూడదన్నది పార్టీ గతంలో పెట్టుకున్న నియమం. ఇపుడు పై ఇద్దరిలో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నా వాళ్ళని ఎంఎల్సీలుగా చేయాలి. ఎంఎల్ఏలుగా పోటీచేసి ఓడిపోయిన వాళ్ళకే మళ్ళీ ఎంఎల్సీ పదవులిచ్చి మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోవాలన్నది ఏఐసీసీ ముఖ్యలు ప్రశ్న. అసలు పోటీకే అవకాశం దక్కని మైనారిటీల్లో నుండి ఎవరినైనా తీసుకోవచ్చని ఢిల్లీ నేతలు సూచిస్తున్నారట.
అయితే ఎవరికో ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవటం రేవంత్ కు ఇష్గంలేదట. రేవంత్ చూపంతా పై ఇద్దరిపైనే ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. అందుకనే ఈనెలాఖరులోగా మంత్రివర్గాన్ని విస్తరిస్తే మైనారిటీల్లో సానుకూలత మరింత పెంచుకోవాలన్నది రేవంత్ ఆలోచన. మరి మైనారిటి కోటాలో మంత్రయ్యే అదృష్టయోగం ఎవరికి ఉందో చూడాల్సిందే.
This post was last modified on January 9, 2024 12:18 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…