నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్ది నెలల క్రితం వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీపై, సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై కోటంరెడ్డి సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. పార్టీకి రెబల్ గా మారిన కోటంరెడ్డి…తమ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. తాజాగా, చంద్రబాబు గురించి కోటంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, టీడీపీ అధికారం చేపడుతుందని కోటంరెడ్డి జోస్యం చెప్పారు.
ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చిన జగన్ మరో చేత్తో 100 రూపాయలు లాగేసుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ పొరపాటున మరోసారి అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితులు లేవని కోటంరెడ్డి విమర్శించారు. ఏపీలో కరెంట్ బిల్లులు పట్టుకుంటేనే కరెంట్ షాక్ కొడుతోందని సెటైర్లు వేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్న క్యాంటీన్లు పునః ప్రారంభమవుతాయని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ‘అమ్మ క్యాంటీన్ల’ను కొనసాగిస్తున్నారని, జగన్ కనీసం పేరు మార్చైనా అన్నా క్యాంటీన్లను కొనసాగించాల్సిందని చెప్పుకొచ్చారు.
పేదల కడపుకొట్టడం సమంజసం కాదని జగన్ కు హితవు పలికారు. 35 ఏళ్లుగా క్వార్జ్ కు సరైన ధర లేక వ్యాపారులు ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో దానికి మంచి రేటు పలుకుతోందని చెప్పారు. ఇటువంటి సందర్భంలో గనులకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల క్వార్ట్జ్ వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 8, 2024 10:27 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…