Political News

కుదిరితే ఓడించ‌డం.. లేక‌పోతే మెజారిటీని త‌గ్గించడం

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ఆయ‌న‌ను ఓడించాల‌నేది టీడీపీ వ్యూహం. ఎందుకంటే.. క‌త్తికి క‌త్తి! అన్న సామెత మాదిరిగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంపై వైసీపీ క‌న్నేసిన నేప‌థ్యంలో వైసీపీ అధినేత సొంత నియోజ‌క‌వ‌ర్గంపై టీడీపీ కూడా క‌న్నే సింది. ఈ నేప‌థ్యంలో కుదిరితే జ‌గ‌న్‌ను ఓడించ‌డం.. లేక‌పోతే మెజారిటీని భారీగా త‌గ్గించడం అనే టార్గెట్‌ను నిర్దేశించుకుంది.

ఈనేప‌థ్యంలో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా బీటెక్ ర‌విని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఈయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర‌లు, స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల‌కు అండ‌గా ఉంటున్నారు. దీంతో బీటెక్ ర‌వి పేరు బాగానే వినిపిస్తోంది. ఇదిలావుంటే.. పులివెందుల‌లో వైఎస్ కుటుంబానికి సంప్ర‌దాయంగా వ‌స్తున్న ఓటు బ్యాంకు ఈ ద‌ఫా కొన్ని కార‌ణాల‌తో దూర‌మ‌య్యే ప‌రిస్తితి వ‌చ్చింది.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌.. త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో వైఎస్ ఫ్యామిలీకి సంప్ర‌దాయంగా ఉన్న ఓటు బ్యాంకు.. ఈ సారి టీడీపీకి వేయ‌క‌పోయినా.. మౌనంగా ఉండ‌నుంద‌నే స‌మాచారం వ‌స్తోంది.

ఈ ప‌రిణామాల‌కు తోడు.. వైఎస్ సునీత ప‌ట్ల సానుభూతి కూడా పెరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ప‌రిణామాలన్నీ కూడా.. బీటెక్ ర‌వికి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఇది ఆయన కు గెలుపును అందిస్తుందా.. ? లేదా.. అనేది ప‌క్క‌న పెడితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ కి ఇక్క‌డ వ‌చ్చిన మెజారిటీ మాత్రం ఈ ద‌ఫా భారీగా త‌గ్గ‌నుంద‌ని టీడీపీ ఒక అంచ‌నాకు వ‌చ్చింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 27, 2023 6:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాన్‌లీ ఉన్నాడా లేడా? – సందీప్ ఏమన్నాడంటే..

ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…

13 mins ago

అసెంబ్లీలో కూన క‌ల్లోలం.. స్పీక‌ర్ ఫైర్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…

2 hours ago

ఎన్నిసార్లు దొరికిపోతావు త‌మ‌న్?

టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…

2 hours ago

భయపడినట్టే దెబ్బ కొట్టిన అమరన్

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…

4 hours ago

ఆ సుకుమార్.. ఈ సుకుమార్.. ఒక్కరేనా?

తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…

5 hours ago

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

7 hours ago