ఈ నెల 21న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్ కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేద, బడుగు బలహీన వర్గాలకు జగన్ అండగా నిలుస్తున్న థీమ్ తో రూపొందించిన ఒక ఇల్యూషనల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరి మధ్యలో జగన్ కూర్చొని ఉన్న ఫొటో ట్రెండ్ అవుతోంది.
పచ్చని పంట పొలాలు ఒకవైపు…కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా రూపుదిద్దుకున్న ప్రభుత్వ పాఠశాలలు మరోవైపు…ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకవైపు….గ్రామ, వార్డు సచివాలయాలు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లు మరోవైపు ఉన్న ఫోటో ట్రెండింగ్ లో ఉంది. ఇలా, పిల్లల మొదలు పెద్దల వరకు అన్ని వర్గాలను సంతోష పెడుతున్న జగన్ వారి మధ్యలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తుంటే అది చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు గోతికాడ నక్కల్లా చూస్తున్న రీతిలో రూపుదిద్దిన ఈ ఫోటో వైసీపీ నేతలు, కార్యకర్తలను విపరీతంగా ఆకట్టుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దం పట్టేలా రూపొందించిన ఈ ఫోటోలు, ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి. అందుకే వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ ఫోన్లలో వాట్సప్ ప్రొఫైల్ పిక్ గా, వాట్సప్ స్టేటస్ లలో, సోషల్ మీడియా ఖాతాల డీపీగా ఈ ఫోటోను పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా రేపు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ థీమ్ ఫ్లెక్సీలు ఊరూవాడా వెలిశాయి. పల్లెలతో పాటు పట్టణాలలో కూడా వైసీపీ నేతలు భారీ సంఖ్యలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఎక్కడ చూసినా ఈ ఫోటో ఈ థీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
This post was last modified on December 20, 2023 5:31 pm
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో దసరా తర్వాత మరో వంద కోట్ల గ్రాసర్ గా నిలిచిన సరిపోదా శనివారం…