జనసేన పార్టీకి సంబంధించి గురువారం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు నియమితుడు కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బన్నీ వాసు పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు.. జనసేన పార్టీ సానుభూతిపరుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అతను ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా బన్నీ వాసు నియమితుడు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
పార్టీలో ముందు నుంచి యాక్టివ్ గా ఉన్న రెగ్యులర్ పొలిటికల్ లీడర్లను కాకుండా.. బన్నీ వాసుకు ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది.
సినిమాల పరంగానే కాక రాజకీయాల విషయంలోనూ బన్నీ వాసు దగ్గర మంచి మార్కెటింగ్ స్ట్రాటజీలు ఉన్నట్లు సమాచారం. అతడికి పొలిటికల్ అడ్వర్టైజింగ్ లో ఇప్పటికే అనుభవం ఉంది. గతంలో మారుతితో కలిసి ప్రజారాజ్యం కోసం ఈ పని చేశాడు. అలాగే వాసుకి మంచి పిఆర్ బలం కూడా ఉంది. సంప్రదాయ శైలికి భిన్నంగా.. యువతను బాగా అట్రాక్ట్ చేసేలా క్యాంపెనింగ్ ఐడియాలతో బన్నీ వాసు టీం ఇంప్రెస్ చేసినట్టు సమాచారం.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించినట్లే క్రియేటివ్, స్ట్రైకింగ్ యాడ్స్ తో పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికార వైఎస్ఆర్సిపి వైఫల్యాలను ఎత్తి చూపేలా క్యాంపెనింగ్ నడిపించేందుకు బన్నీ వాసు టీం పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు సమాచారం. బన్నీ వాసు చేతుల్లోకి జనసేన ఎన్నికల ప్రచార కమిటీ వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆ పార్టీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది.
This post was last modified on December 15, 2023 4:10 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…