ఏపీ రాష్ట్ర హోం మంత్రి ఒక మహిళ. దిశ చట్టాన్ని తీసుకొచ్చి అత్యాచారాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మహిళలపై నేరాలకు పాల్పడితే ఏకంగా జైలుపాలే అంటూ భారీ ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అత్యాచార కేసుల నమోదు ఎక్కువగా ఉండటం దేనికి నిదర్శనం? భర్త కళ్ల ముందే భార్యను.. బైకు మీద ప్రియుడితో వెళుతున్న ప్రియురాలిని.. ఇంట్లో ఉన్న మైనర్ బాలికపైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో అత్యాచార కేసుల సంఖ్య భారీగా ఉంటోంది.
మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడటం లేదన్న మాటను చెబుతున్నా.. గణాంకాలు మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగేలా చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆర్నెల్ల సంగతే చూస్తే.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. రాష్ట్రంలో ప్రతి రోజూ ముగ్గురికి పైగా అత్యాచారాలు జరుగుతున్నట్లుగా లెక్క తేలింది. అంటే.. నెలకు 98 మంది చొప్పున అత్యాచారాలకు గురి అవుతున్నట్లుగా గుర్తించారు.
ఇంత భారీగా కేసులు నమోదు కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇవి సరిపోవన్నట్లుగా పోలీసులపై దాడి చేస్తున్న వైనం ఏపీ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీస్తుంది. ఓవైపు కఠిన చట్టాలు ఉన్నట్లుగా చెబుతున్నప్పటికి.. ఏపీలో మాత్రం అత్యాచారాల కేసులు అంతకంతకూ పెరిగిపోవటం గమనార్హం. పాత రికార్డుల్ని చూసినా.. కేసులు పెరుగుతున్న వైనం కనిపిస్తుంది. 2018 మొదటి ఆరు నెలల్లో 546 అత్యాచార కేసులు నమోదైతే.. 2019లో 560 కేసులు నమోదయ్యాయి. తాజాగా (2020)లో 584 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.
ఇక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యధిక అత్యాచార ఘటనలు ఏపీ కార్యనిర్వాహఖ రాజధానిగా అభివర్ణిస్తున్న విశాఖలో ఆర్నెల్ల వ్యవధిలో 90 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా 85 కేసులతో నిలవగా మూడో స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా నిలిచింది. పెద్ద ఎత్తున నమోదవుతున్నకేసులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
This post was last modified on August 31, 2020 5:05 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…