ఏపీలో వైసీపీ హయాంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కీలకమైన రహదారుల నిర్మాణ, బాగుజేత వంటివాటి విషయంలో వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం మానేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం నుంచి సామాజిక సాధికార యాత్రల వరకు కూడా.. ఎక్కడ కనిపించినా.. ప్రజలు ఈ విషయంపైనే నిలదీస్తున్నారు.
ఇక, టీడీపీ-జనసేన మిత్రపక్షం ఆధ్వర్యంలో రహదారుల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా తెలిపారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ప్రజాప్రతినిధులకు నిరసన మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ మంత్రి కనిపించినా.. వైసీపీ ఎమ్మెల్యే కనిపించినా.. తమకు రహదారులు ఏవని, ఉన్నవాటిని బాగు చేయరెందకని ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు సర్దిచెబుతున్నా.. మరికొందరు మాత్రం సహనం కోల్పోతున్నారు.
ఈ క్రమంలో ప్రజలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రజలపై నే ఎదరు దాడి చేశారు. అధ్వానంగా మారిన తమ గ్రామ రహదారిని బాగు చేయాలని తనకల్లు మండలం చిన్నరామన్న గారిపల్లి వాసులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని గ్రామస్థులు విస్తుపోయారు. నియోజకవర్గంలో ప్రతినెల పింఛన్ల కోసం రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నామని వాటిని ఆపేస్తే రోడ్లన్నీ అద్దంలా చేయొచ్చన్నారు. పింఛన్లు తీసుకోవడం మానేస్తారా? రోడ్లు వేయిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో గ్రామస్తులు నివ్వెర పోయారు.
This post was last modified on November 24, 2023 4:38 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…