పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. తొందరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ పెరిగిపోతుండటం బీఆర్ఎస్ లో కలవరపాటు పెంచేస్తోంది. అందుకనే బీజేపీ మీద బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంటున్నట్లు టాక్ మొదలైంది. బీజేపీ మీద బీఆర్ఎస్ ఆశలు పెంచుకోవటం ఏమిటనే సందేహం మొదలైందా ? అసలు తెలంగాణాలో కాంగ్రెస్ కు ఒక్కసారిగా ఊపు ఎప్పుడు మొదలైంది ? బీజేపీ గ్రాఫ్ డౌన్ అయిపుడే కదా.
అదే బీజేపీ గ్రాఫ్ మళ్ళీ పెరిగితే ఆ మేరకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోతుందనే లెక్క బీఆర్ఎస్ లో మొదలైంది. మరి బీజేపీ గ్రాఫ్ పెరగాలంటే ఏమిచేయాలి ? బీజేపీ, బీఆర్ఎస్ ఒకటికాదని నిరూపించుకోవాలి. అందుకనే బీజేపీని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు కేసీయార్ అండ్ కో. బహిరంగసభల్లో కేసీయార్, రోడ్డుషో, ర్యాలీల్లో కేటీయార్, హరీష్ రావులు పదేపదే బీజేపీని టార్గెట్ చేయటం మొదలుపెట్టడానికి కారణం ఇదేనట.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న కాంగ్రెస్ ప్రచారాన్ని నిజమే అని జనాలు నమ్మటంతోనే కమలంపార్టీ గ్రాఫ్ పడిపోయిందని కేసీయార్ అండ్ కో అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలతోనే జనాలు నమ్మలేదని, రెండుపార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగినట్లు జనాలు నమ్మారన్న విషయాన్ని కేసీయార్ మరచిపోతున్నారు. ఎలాగంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు కవిత కీలక సూత్రదారని ఈడీ విచారణలో తేల్చింది. కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టులు, చార్ఝిషీట్లలో కూడా చాలా సార్లు ఇదే చెప్పింది.
స్కామ్ లో కవిత పాత్రపై ఆధారాలున్నాయని చెప్పిన ఈడీ మరి ఎందుకని అరెస్టుచేయలేదు ? ఇక్కడే జనాలకు రెండుపార్టీల మీద అనుమానాలు మొదలయ్యాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుని ఆరోపణలతో రెచ్చిపోయింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పిల్లర్ కుంగటంతో బ్యారేజి కూడా కుంగింది. కేసీయార్ అవినీతి కారణంగానే మేడిగడ్డ బ్యారేజి నాశిరకంగా నిర్మాణమైందని కాంగ్రెస్ ఆరోపణలుచేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటి కూడా నిర్ధారించింది. అయినా ఎవరిపైనా యాక్షన్ ఎందుకు లేదు ?
ఇలాంటి అనేక కారణాలతోనే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని జనాలు నమ్మబట్టే రెండుపార్టీల గ్రాఫ్ పడిపోయింది. మరిపుడు మళ్ళీ గ్రాఫ్ పెంచుకోవాలని రెండుపార్టీలు ప్రయత్నించటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ? బీజేపీకి ఓటింగ్ పెరిగితే ఆ మేరకు కాంగ్రెస్ కు తగ్గితే బీఆర్ఎస్ లాభపడుతుందని కేసీయార్ అనుకుంటున్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on November 20, 2023 10:58 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…