మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి తొందరలోనే చెక్ పెట్టబోతున్నారా ? ఇందుకు రంగం సిద్ధమైందా ? ఇపుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈ విషయంపైనే పెద్ద చర్చ మొదలైంది. జిల్లాలో పార్టీకి బాలినేని పెద్ద సమస్యగా మారిపోయారు. ప్రతి చిన్న విషయానికి అలగటం, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనబడకపోవటం, ఇచ్చిన బాధ్యతలను చూడకపోవటం, ఎంతసేపు పార్టీపైన అసంతృప్తి వ్యక్తంచేయటంతోనే మాజీమంత్రి రాజకీయమంతా సరిపోతోంది. బాలినేని అలిగినపుడల్లా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. దాంతో జగన్ అంటే కొందరు నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.
తనకు జగన్ ఎంత సన్నిహితుడు అని చెప్పుకోవటానికే బాలినేని అలుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జగన్ కూడా బాలినేనిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీవర్గాల టాక్. అందుకనే బాలినేనిని పక్కనపెట్టేసి ముందుకెళ్ళాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే బాలినేనికి దగ్గర బంధులు, సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని యాక్టివ్ చేస్తున్నట్లు సమాచారం. వైవీ మాట్లాడుతు తాను జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించబోతున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.
వైవీ చేసిన రెండు ప్రకటనలతో బాలినేనికి షాక్ కొట్టినట్లయ్యింది. అవసరమైతే తనను వదులుకోవటానికి కూడా జగన్ సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా బాలినేనికి సమాచారం అందిదట. దాంతో ఇపుడు ఏమిచేయాలనే విషయమై బాలినేని తన మద్దతుదారులతో మంతనాలు మొదలుపెట్టారు. ఏదేమైనా వైవీ ద్వారానే బాలినేనికి చెక్ పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు అర్ధమవుతోంది.
వచ్చేఎన్నికల్లో వైవీ ఎంపీగా పోటీచేస్తే సమస్యుండదు. ఎందుకంటే గతంలో ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అలాకాకుండా వైవీ ఎంఎల్ఏగా పోటీచేస్తే మాత్రం బాలినేనికి సమస్యలు తప్పవు. ఎందుకంటే వైవీ ఎక్కడినుండి పోటీచేస్తారన్నదే పెద్ద సమస్య అయిపోతుంది. బాలినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నుండి వైవీ పోటీచేయాలని అనుకుంటే బాలినేనిని పార్టీనుండి బయటకు పంపటానికి జగన్ రెడీ అయిపోయినట్లే అనుకోవాలి. అయితే ఎక్కడినుండి పోటీచేయబోతున్నారనే విషయాన్ని వైవీ ప్రకటించకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 15, 2023 9:50 am
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…