బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై కొద్ది రోజులుగా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును పురంధేశ్వరి ఖండించిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు తదితరులు…పురంధేశ్వరిపై జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పురంధేశ్వరిపై మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పురందేశ్వరి రోజు మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నారేమో అని అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఏపీలో మద్యం అమ్మకాలపై పురందేశ్వరి కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిపై స్పందించిన అప్పలరాజు..ఇలా పురంధేశ్వరిపై నోరు జారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను మద్యం తాగనని, తనకు మద్యం టేస్ట్ లపై అవగాహన లేదని చెప్పిన అప్పలరాజు…మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని ఆరోపించారు.
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పురందేశ్వరికి కొంచెం గౌరవం ఉండేదని, కానీ, బీజేపీలో చేరిన తర్వాత చంద్రముఖిగా మారారని సెటైర్లు వేశారు. బీజేపీలోనూ పురందేశ్వరికి గౌరవం లేదని, ఆ పార్టీలో ఆమె ఉండడం అనవసరమని, టీడీపీలో చేరితే సరిపోతుందని సెటైర్లు వేశారు. మరి, అప్పల రాజు వ్యాఖ్యలపై పురందేశ్వరి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 10, 2023 10:09 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…