ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ కేసీయార్ స్లోగన్ మారుతోంది. భవిష్యత్తంతా ప్రాంతీయ పార్టీలదే అని కేసీయార్ పదే పదే చెబుతున్నారు. మొన్నటివరకు జాతీయపార్టీ బీఆర్ఎస్ ద్వారా దేశం మొత్తాన్ని ఏలేస్తానని గొప్పలు చెప్పుకున్న విషయం చూసిందే. మహారాష్ట్రాలో హడావుడి చేశారు. రెండు మూడుసార్లు కర్నాటకకు వెళ్ళారు. అవసరం లేకపోయినా ఉత్తరప్రదేశ్, పంజాబ్ అమరవీరులకు భారీ మొత్తంలో పరిహారాన్ని అందించారు. తరచూ ఢిల్లీకి వెళ్ళి క్యాంపేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదంతా దేనికి చేశారంటే జాతీయస్ధాయిలో ఎన్డీయే, యూపీఏకి బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని చెప్పటానికే.
సీన్ కట్ చేస్తే ఇపుడు తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ అనే పేరునే కేసీయార్ ప్రస్తావించటంలేదు. జై భారత్ అన్న నినాదమే వినిపించటంలేదు. ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ప్రాంతీయ పార్టీలదే హవా అంటున్నారు. ఒక్కసారిగా కేసీయార్లో ఎందుకింత మార్పొచ్చింది ? ఏమి ఆశించి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చారు ? ఈ ఎన్నికల ప్రచారంలో అసలు బీఆర్ఎస్ అన్న ప్రస్తావనే ఎందుకు తేవటంలేదు ?
ఎందుకంటే జనాల్లో జాతీయపార్టీ బీఆర్ఎస్ అన్నది సరిగా రిజిస్టర్ కాలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. జాతీయ పార్టీలు అంటే జనాల్లో ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అని మాత్రమే పీలింగ్ ఉందని అభ్యర్ధులు, నేతలే కేసీయార్ కు చెప్పారట. దాంతో జాతీయపార్టీ బీఆర్ఎస్ అని చెబితే నష్టం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో స్వయంగా కేసీయారే ప్రాంతీయపార్టీలదే భవిష్యత్తని యూటర్న్ తీసుకోవాల్సొచ్చిందట. ఇంతోటి దానికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారనే చర్చ పార్టీలోనే పెరిగిపోతోంది.
నిజానికి జాతీయ రాజకీయాల్లో కేసీయార్ ను పట్టించుకునే వాళ్ళేలేరు. జాతీయస్ధాయిలో కేసీయార్ విశ్వసనీయత బాగా దిబ్బతినేసింది. అందుకనే ఏ జాతీయపార్టీకానీ లేదా ప్రాంతీయపార్టీలు కానీ కేసీయార్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేరు. కేసీయార్ తో పొత్తుకు సిద్ధమని ప్రకటించిన కుమారస్వామి, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో భాగస్వాములైపోయారు. ఇదంతా చూసిన తర్వాతే కేసీయార్ మళ్ళీ ప్రాంతీయపార్టీ అనే స్లోగన్ మొదలుపెట్టినట్లున్నారు.
This post was last modified on November 10, 2023 1:27 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…