దేశంలో మరెక్కడా లేని రీతిలో కొత్త కొత్త బ్రాండ్లతో మద్యాన్ని అమ్ముతోంది ఏపీ సర్కారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని పూర్తిగా మార్చేయటమే కాదు.. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే సరికొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి. అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు కాకుండా.. కొన్ని ప్రత్యేక బ్రాండ్లతో మద్యాన్ని అమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అలా అమ్ముతున్న మద్యంపై ఏపీ అధికారపక్ష ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గడిచిన కొద్దికాలంగా సొంత ప్రభుత్వం మీద విమర్శలు.. ఆరోపణలు చేస్తూ అందరి నోళ్లలో నానుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా తన మార్క్ కామెంట్స్ తో వార్తల్లోకి వచ్చారు.
ఏపీలో అమ్ముతున్న మద్యాన్ని తాగితే రెండు.. మూడేళ్లలో చనిపోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఒకే కంపెనీలో తయారయ్యే ఈ మద్యం బ్రాండ్లు ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే అవకాశం ఉందన్నారు. ఏపీలో తయారయ్యే మద్యం చాలా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో దొరికే ఊరు.. పేరు లేని బ్రాండ్లను తాగేయటం మానేయాలన్న ఆయన.. మంచి బ్రాండు ఒక్కటి కూడా ఏపీలో ఎందుకు అమ్మటం లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్లపై పలు ప్రశ్నలు సంధించారు.
ఈ బ్రాండ్లను ఎవరు తయారు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? వాటి ఉత్పత్తి.. ధరలు ఎవరు డిసైడ్ చేస్తున్నారన్న విషయాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ మాయదారి బ్రాండ్ల గురించి ముఖ్యమంత్రి జగన్ కు తెలియనది.. ఈ విషయంపై ఆయన జోక్యం చేసుకొని.. అన్ని వివరాలు తెప్పించుకోవాలన్న ఆయన వ్యాఖ్య ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. సీఎం జగన్ కు తెలీకుండా.. మద్యంపై ఇంతలా నిర్ణయాలు తీసుకుంటున్న వారెవరై ఉంటారంటారు?
This post was last modified on August 28, 2020 11:34 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…