తెలంగాణ ఎన్నికల్లో సీట్ల లొల్లి కాంగ్రెస్ లో కాక రేపుతూనే ఉంది. తాజాగా 45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని నాయకులు అసంత్రుప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుల జాబితాలో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. జూబ్లిహిల్స్ టికెట్ తనకే వస్తుందని ఇన్ని రోజులూ విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారానికి కూడా తెరలేపారు. కానీ ఇప్పుడు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ కు కాంగ్రెస్ అధిష్ఠానం ఈ టికెట్ కేటాయించింది.
జూబ్లిహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి రగలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన అజహరుద్దీన్ మొదటి నుంచి జూబ్లిహిల్స్ టికెట్ పైనే కన్నేశారు. మధ్యలో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు జూబ్లిహిల్స్ కు కూడా వచ్చారు. అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కార్యకర్తలు అజహరుద్దీన్ ను అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఇప్పుడేమో తనకు కాకుండా అజహరుద్దీన్ కు పార్టీ టికెట్ కేటాయించడంపై విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె సోదరి విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ దక్కింది. దీంతో పార్టీలోని ఇతర నాయకులకు ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చారు కానీ తమకు మాత్రమే నిబంధన అడ్డువచ్చిందా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో అర్ధం కావడం లేదని విష్ణువర్ధన్ అన్నారు. రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో షాక్ కు గురయ్యానని ఆయన చెప్పారు. పార్టీకి ఎవరు ముఖ్యమో గమనించాలన్నారు. హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలకు దండాలు పెట్టేవాళ్లకు కాకుండా ఢిల్లీలో దండాలు పెట్టిన వాళ్లకే టికెట్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న ఏకైక నియోజకవర్గం జూబ్లిహిల్స్ అని.. ఇప్పుడు నియోజకవర్గంతో సంబంధం లేని వాళ్లకు టికెట్ ఇచ్చారని ఆయన అన్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్న ఆయన కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్వతంత్రంగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది.
This post was last modified on October 28, 2023 11:15 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…