Political News

ఆరు గ్యారెంటీల భారం నీదే స్వామీ: రాహుల్, ప్రియాంక‌ల పూజ‌లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు ముందు ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌.. ఈ ఎన్నిక‌ల్లో వీటిని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం స‌మా ఏడాదికి 4 గ్యాస్ సిలెండ‌ర్లు ఉచితం, రూ.500 ల‌కే గ్యాస్, మ‌హిళ‌ల‌కు నెల నెలా రూ.2000 సాయం వంటి కీల‌క హామీలు ఈ ఆరు గ్యారెంటీల్లో ఉన్నాయి. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ నేత‌లు ముహూర్తం పెట్టుకున్నారు.

ఇక‌, తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయ‌న సోద‌రి ప్రియాంక గాంధీలు.. తెలంగాణ‌కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్క‌డ ప‌ర్య‌టించనున్న వారు.. బ‌స్సు, బైకు యాత్ర‌లు చేప‌ట్టారు. ఇక‌, ఈ క్ర‌మంలో హ‌నుమ‌కొండలో ప‌ర్య‌టించిన రాహుల్‌, ప్రియాంక‌లు.. ఇక్క‌డి రామ‌ప్ప దేవాల‌యాన్ని సంద‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల‌కు సంబంధించిన కార్డును రామ‌ప్ప పాదాల వ‌ద్ద ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీనియర్‌ నేతలు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్డులను స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క తదితరులు రాహుల్‌ వెంట ఉన్నారు. ప్రత్యేక పూజల అనంతరం రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్‌ విజయభేరి యాత్రను రాహుల్‌, ప్రియాంక గాంధీ ప్రారంభించారు.

This post was last modified on October 18, 2023 10:28 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

7 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

8 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

9 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

9 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

12 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

12 hours ago