తెలంగాణలో వైఎస్సార్ టీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉంటుందని, కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయబోతున్నారని చాలాకాలంగా టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో విలీనం ప్రతిపాదనను షర్మిల వెనక్కు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. షర్మిల మిర్యాలగూడ, పాడేరు నుంచి పోటీ చేస్తారని, విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ విషయాన్ని వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ ఒంటరిగానే పోటీ చేయబోతోందని షర్మిల సంచలన ప్రకటన చేశారు. మొత్తం 119 స్థానాల్లో వైెఎస్సార్టీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనుకున్నామని, ఆ క్రమంలోనే కాంగ్రెస్ తో చర్చలు జరిపామని వెల్లడించారు. అందుకే, కాంగ్రెస్ నిర్ణయం కోసం 4 నెలలు వేచి చూశామని అన్నారు.
తాను పాలేరుతో పాటు మరో స్థానంలో కూడా పోటీ చేస్తానని, విజయమ్మ, అనిల్ కూడా పోటీ చేయాలనే డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. అయితే, విజయమ్మ పోటీ చేసే అవకాశాలున్నాయని, బీఫామ్ ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on October 12, 2023 9:51 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…