అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సిఐడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాడేపల్లి సిట్ కార్యాలయంలో లొకేషన్ సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఓవైపు విచారణ జరుగుతుండగానే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లోకేష్ ను విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారిని హఠాత్తుగా మారుస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది.
ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఎస్పీ జయరామరాజు స్థానంలో డిఎస్పీ విజయభాస్కర్ కు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇలా, విచారణ అధికారి మార్పునకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జయరామరాజుకు పని భారం ఎక్కువగా ఉందని, ఆ కారణంతోనే దర్యాప్తు అధికారిని మారుస్తున్నామని ఆ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. విచారణ సందర్భంగా లోకేష్ ను సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. లింగమనేని రమేష్ కు, మీకు ఉన్న సంబంధం ఏమిటి అని లోకేష్ ను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
హెరిటేజ్ సంస్థ భూ కొనుగోళ్లపై కూడా సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ ఆధ్వర్యంలోనే భూముల కొనుగోలు జరిగిందని, ఎకరం ఎనిమిది లక్షలకు కొనుగోలు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, హెరిటేజ్ కు సంబంధించిన ఒక సమావేశానికి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో లోకేష్ హాజరైనట్లు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారని తెలుస్తోంది.
This post was last modified on October 10, 2023 10:00 pm
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గౌరవార్థంగా భారీ నగదు బహుమతి…
బాక్సాఫీస్ వద్ద మోస్ట్ పేయబుల్ హీరోల్లో ఒకడిగా మారిన సిద్దు జొన్నలగడ్డకు సినిమాల పరంగా మధ్యలో బాగానే గ్యాప్ వస్తోంది.…