Political News

ఎవరు? ఎప్పుడు? ఏ పార్టీలో చేరునో?

తెలంగాణ ఎన్నికల వేడి మొదలైంది. రెండు రోజుల క్రితం ఓ నాయకుడు ప్రచారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. తమ పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఇప్పుడు మరోసారి ఆ గ్రామానికి వెళ్లారు. కానీ ఇప్పుడు మెడలో కండువా వేరు. చేతిలో జెండా వేరు. పార్టీ వేరు. ఎందుకంటే ఆ నాయకుడు మరో పార్టీలోకి మారిపోయారు. గతంలో పొగిడిన పార్టీని ఇప్పుడు తిడుతూ.. కొత్తగా చేరిన పార్టీకి ఓట్లు వేయాలని కోరుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ జంపింగ్ లకు ఈ ఉదంతమే నిదర్శనం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. త్వరలోనే షెడ్యూల్ వెల్లడించే ఆస్కారముంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవి మీద ఆశతో ఉన్న నాయకులు టికెట్ల కోసం, చిన్న స్థాయి నాయకులు మంచి ప్రాధాన్యత కోసం పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పార్టీ జంపింగ్ ల ట్రెండే నడుస్తుందని చెప్పొచ్చు. ఒక రోజు ఒక పార్టీలో కనిపించే నాయకుడు.. తర్వాతి రోజు మరో పార్టీలో కనిపిస్తున్నారు. టికెట్ల ఆశతో పార్టీలు మారుతున్న నాయకులు చాలా మందే ఉన్నారు.

బీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కడం లేదని పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వర రావు, తనకు టికెట్ దక్కినా కొడుక్కి రాలేదని కారణంతో మైనంపల్లి హన్మంతరావు హస్తం గూటికి చేరారు. ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన, చేరుతున్న నాయకుల జాబితా పెద్దదిగానే ఉంది. ఇక మైనంపల్లి రాకతో మెదక్, మేడ్చల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఇక బీజేపీలో పట్టించుకోవడం లేదనే నిరాశతో ఉన్న కొంతమంది కీలక నాయకులు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు జంపింగ్ ల హవా నడుస్తోందని చెప్పొచ్చు. ఏ పార్టీ ఎక్కడ ఏ సమావేశం పెట్టినా అక్కడికి వచ్చిన వాళ్లకు కండువాలు కప్పడం పార్టీలో చేర్చుకోవడం కామన్ గా మారిపోయింది.

This post was last modified on October 9, 2023 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…

2 hours ago

రాజాసింగ్…క‌న‌బ‌డుట‌లేదు!

రాజాసింగ్‌... రాజ‌కీయాల ప‌ట్ల క‌నీస ప‌రిచ‌యం ఉన్న‌వారికి ఎవ‌రికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి  కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు.…

2 hours ago

ఎంపీ అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు?

వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…

5 hours ago

నయన్‌పై ధనుష్ ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్

ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…

5 hours ago

డాన్‌లీ ఉన్నాడా లేడా? – సందీప్ ఏమన్నాడంటే..

ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…

11 hours ago