Movie News

ఆ దర్శకుడికి ఛాన్సిచ్చేదెవరు?

అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి, తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ‘జాతిరత్నాలు’ సినిమా తీసింది ఈ దర్శకుడే. కామెడీ అంటే ఇలాగే ఉండాలి అనే ఒక మూసను అతను బ్రేక్ చేశాడు. లీడ్ క్యారెక్టర్లను పూర్తి డంబ్‌గా తీర్చిదిద్ది.. కథాకథనాలను ఏ దశలోనూ సీరియస్‌గా తీసుకోకుండా.. సీరియస్ అనిపించే సందర్భాల్లోనూ వినోదాన్ని పంచి.. అతను ఆద్యంతం నవ్వులు పంచిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

కానీ అనుదీప్ మెరుపులు ఆ ఒక్క సినిమాకే పరిమితం అయిపోయాయి. తన తర్వాతి చిత్రం ‘ప్రిన్స్’ నిరాశపరిచింది. దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘ఫంకీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనుదీప్‌కు ఇంకా పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమా మినిమం ప్రభావం చూపకుండా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది.

అనుదీప్ తొలి చిత్రం ‘పిట్టగోడ’ గురించి జనాలకు అస్సలు తెలియదు. మొత్తంగా నాలుగు సినిమాలు తీస్తే మూడు డిజాస్టర్లు అయ్యాయి. ఒక్కటే బాగా ఆడింది. ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ ప్రొడక్షన్లో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఇంకో సినిమా కూడా వచ్చింది. అదీ తుస్సుమనిపించింది. ప్రిన్స్, ఫంకీ చిత్రాలు చూస్తే.. అనుదీప్‌కు వచ్చింది ఒకే స్టైల్ ఆఫ్ కామెడీ.. అది కూడా ఇప్పుడు సేల్ అయ్యేలా లేదనిపిస్తోంది. దీనికి మించి అతనేమీ చేయలేడు అనే ముద్ర పడిపోయింది. నవీన్ పొలిశెట్టి లాంటి స్పెషల్ టాలెంట్ ఉన్న హీరో తప్పితే.. అతడి మార్కు కామెడీని మరో నటుడు పండించలేడేమో అనిపిస్తోంది. ఒకవేళ నవీన్ వచ్చి అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేసినా సరే.. మళ్లీ ‘జాతిరత్నాలు’ స్థాయిలో నవ్వించగలడా అన్నది సందేహమే. 

‘జాతిరత్నాలు’ తర్వాత ఒక దశలో రవితేజ లాంటి స్టార్ కూడా అనుదీప్‌తో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఇప్పుడు ఇంకా చిన్న స్థాయి హీరోలు కూడా వెనుకంజ వేసే పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాతలు దొరకడం కూడా సందేహంగా ఉంది. ఈ దశ నుంచి అనుదీప్ పుంజుకోవడం కష్టంగానే ఉంది. ‘జాతిరత్నాలు’ తర్వాత పేరున్న హీరోలు, పెద్ద బేనర్లలో రెండు సినిమాలు చేయగలిగాడు కానీ.. ‘ఫంకీ’ తర్వాత అవకాశాలు అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మరి అతణ్ని నమ్మి సినిమా చేసే నిర్మాత, హీరోలు ఎవరో చూడాలి మరి.

This post was last modified on March 9, 2026 5:15 am

Share

Recent Posts

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

1 hour ago

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

2 hours ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

4 hours ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

4 hours ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

7 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

7 hours ago