ప్రజా యుద్ధనౌక, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబం నుంచి ఒకరికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనుందా? ఈ మేరకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గద్దర్ కుటుంబం నుంచి ఒకరిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గద్దర్ తనయ వెన్నెలను కంటోన్మెంట్ నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం నిర్ణయించిందని తెలిసింది. ఈ టికెట్ విషయంపై చర్చించిన టీపీసీసీ.. వెన్నెల అభ్యర్థిత్వం గురించి ఏఐసీసీకి చెప్పినట్లు తెలిసింది. దీనికి హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
బతికి ఉన్న చివరి రోజుల్లో గద్దర్ కాంగ్రెస్ మనిషిగా మారిపోయారనే చెప్పాలి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కే ఉందని నమ్మిన ఆయన.. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సభల్లో ప్రత్యేక ఆకర్షణగానూ నిలిచారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆయన మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ గద్దర్ కుటుంబానికి అండగా నిలిచింది. అంత్యక్రియల సమయంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గద్దర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
గద్దర్ కుమారుడు సూర్య గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ లో చేరారు. కానీ గద్దర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆ ఎన్నికల్లో సూర్యకు చివరి నిమిషంలో టికెట్ దక్కకుండా పోయిందని చెప్తారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో సూర్యకు బదులు వెన్నెలను నిలబెడితేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ నమ్ముతుందని తెలిసింది. అందుకే వెన్నెల వైపే హైకమాండ్ మొగ్గు చూపిందని టాక్. కాంగ్రెస్ టికెట్ విషయాన్ని యధుయాష్కి గద్దర్ ఇంటికి వెళ్లి చెప్పినట్లు తెలిసింది.
This post was last modified on October 8, 2023 7:23 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…