Political News

ఏపీ రాజకీయం.. ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే

ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంజుగా మారుతోంది. గత నెల రోజుల్లో ఎంత వేగంగా పరిణామాలు మారిపోయాయో తెలిసిందే. కొన్ని నెలల తర్వాత కానీ క్లారిటీ రాదనుకున్న తెలుగుదేశం-జనసేన పొత్తు విషయమై గత నెలలోనే స్పష్టత వచ్చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు అరెస్టు అయిన కొన్ని రోజులకే పవన్ స్వయంగా పొత్తును అధికారికంగా ప్రకటించాడు.

ఐతే పవన్ ప్రకటన అయితే చేశాడు కానీ.. టీడీపీ నాయకులు ఆయనంత ఓపెన్‌గా ఉంటారా.. జనసేనకు బాసటగా నిలుస్తారా.. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. కానీ నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్.. పవన్ విషయంలో చాలా సానుకూలంగా మాట్లాడ్డం.. వారాహి యాత్రకు కూడా మద్దతు ప్రకటించడం.. ఈ యాత్ర సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తలు కలిసి సాగడం.. పవన్ కూడా టీడీపీ విషయంలో మళ్లీ మళ్లీ సానుకూలంగా మాట్లాడడంతో రెండు పార్టీల మధ్య మంచి సమన్వయమే కనిపిస్తోంది.

ఇక ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య అంతరం పెంచడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. వాటిని ఉమ్మడిగా ఎదుర్కోవడం తప్ప వైసీపీకి మరో మార్గం కనిపించడం లేదు. ఇక తేలాల్సిందల్లా బీజేపీ ఎటు వైపు ఉంటుందన్నదే. గత నాలుగేళ్లలో పరిణామాలు గమనిస్తే.. అధికారికంగా పొత్తు జనసేనతో అయినా, వైసీపీకే బీజేపీ ఎక్కువ సహకరించిన సంకేతాలు కనిపించాయి. తమతో పొత్తులో ఉన్న జనసేన.. టీడీపీతో కలిసి సాగాలని నిర్ణయించుకోవడంతో బీజేపీ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. కాగా పవన్ తాజాగా వారాహి యాత్రలో తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పేశాడు. ఇలాంటి పెద్ద నిర్ణయాన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ప్రకటిస్తాడేమో అనుకున్నారు. కానీ పవన్ యాత్రలో.. తన ప్రసంగం మధ్యలో ఈ మాట చెప్పడం చర్చనీయాంశం అయింది. అధికారికంగా ప్రకటన చేసి.. దీన్ని చర్చనీయాంశం చేయడం, అలాగే బీజేపీతో శత్రుత్వం పెంచుకోవడం పవన్‌కు ఇష్టం లేదన్నట్లు కనిపిస్తోంది.

అదే సమయంలో బీజేపీతో కలిసి వెళ్తే మైనారిటీ ఓట్లు పడవన్న భయం కూడా ఉన్నట్లుంది. ఇటీవలి సర్వేల్లో కూడా బీజేపీతో కలిసి వెళ్తే టీడీపీ, జనసేన కూటమికి లాభం కంటే నష్టమే ఎక్కువన్న సంకేతాలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి పవన్ దూరం జరగాలని నిర్ణయించుకున్నాడు. వైసీపీ కూడా అధికారికంగా బీజేపీతో కలిసే పరిస్థితి లేదు. కానీ బీజేపీతో వైసీపీ అనధికారిక బంధంలో ఉన్నట్లు జనం ఇప్పటికే ఫిక్సయిపోయారు. బీజేపీ పట్ల మెతక వైఖరిని కొనసాగిస్తే.. ఎన్నికల్లో ఆ పార్టీకి నష్టం కూడా చేయొచ్చు. ఇక ఏపీలో తేలాల్సిందల్లా వామపక్షాలు ఎవరి వైపు ఉన్నారన్నదే. అది కూడా తేలిపోతే.. ఎన్నికల ముఖచిత్రంపై పూర్తి స్పష్టత వచ్చేసినట్లే.

This post was last modified on October 5, 2023 10:51 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రాష్ట్రానికి చ‌రిత్రాత్మ‌క రోజు:  చంద్ర‌బాబు

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్రానికి…

2 hours ago

ఏపీలో అశాంతి రేపిన ప్ర‌శాంత ఎన్నిక‌లు!

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు(అసెంబ్లీ+పార్ల‌మెంటు) ప్ర‌శాంతంగా జ‌రిగాయ‌ని ఎన్నిక‌లు సంఘం చెబుతోంది. అయితే.. ప్ర‌శాంతత కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. జిల్లాల‌కు మాత్ర‌మే…

2 hours ago

మళ్లీ వివరణ ఇచ్చుకున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…

2 hours ago

ఎమ్మెల్యే-చెంపదెబ్బ.. నేషనల్ ట్రెండింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…

2 hours ago

పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…

8 hours ago

జైలుకు వెళ్ల‌కుండా మీరే న‌న్ను కాపాడాలి:  కేజ్రీవాల్‌

కీల‌క‌మైన నాలుగోద‌శ ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవా ల్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.…

8 hours ago