తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గంలో పదేళ్ళుగా ఎంఎల్ఏగా పనిచేస్తున్నా పెద్దగా యాక్టివ్ గా ఉండరు. పార్టీ కార్యక్రమాల్లో తనకు వీలైనపుడు పాల్గొంటారు లేకపోతే లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీలుంటేనే హాజరవుతారు. దీనికి కారణం ఏమిటంటే ఎక్కువ భాగం సినిమా షూటింగుల్లో ఉండటమే. సినిమాలే బాలయ్యకు ఫుల్ టైం, పాలిటిక్స్ కేవలం పార్ట్ టైమ్ మాత్రమే. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు, రిమాండు నేపథ్యంలో మాత్రమే బాలకృష్ణ పార్టీ నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు.
ఇలాంటి బాలయ్య తెలంగాణా రాజకీయాలలో యాక్టివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మీడియాతో మాట్లాడిన బాలయ్య తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ప్రకటించారు. పార్టీ కోసం తెలంగాణాలో ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు. పోయిన ఎన్నికల్లో నేతలు, క్యాడర్ లో కాస్త భయం, స్థబ్దత ఉన్న మాట వాస్తవమే అని అంగీకరించారు. అయితే వాటిని పోగొట్టినట్లు కూడా చెప్పారు.
కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో తాను విస్తృతంగా ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాలు తమకు రెండు కళ్ళని, తెలంగాణా ఎన్నికల కోసం స్టీరింగ్ కమిటీని కూడా వేసినట్లు చెప్పారు. బాలయ్య తాజా మాటలను చూస్తుంటే తెలంగాణా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని డిసైడ్ అయినట్లు అనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ బాలయ్య ఇలాంటి ప్రకటనలు చేయలేదు. ఇపుడు పనిగట్టుకుని ప్రకటన చేశారంటేనే తమ్ముళ్ళల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
తెలంగాణా ఎన్నికల సమయానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి చంద్రబాబు బయటకు వస్తారా రారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. చంద్రబాబు అందుబాటులో ఉంటే బాలయ్య యాక్టివ్ గా ఉండాల్సిన అవసరంలేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు బాలయ్య నేతలకు రెగ్యాలర్ గా టచ్ లో ఉన్నదిలేదు. అలాంటిది తాను తెలంగాణాలో తిరుగుతానని, ప్రచారం చేస్తానని, పూర్వ వైభవం తీసుకొస్తామని చాలా మాటలు చెప్పటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి తెలంగాణా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సిందే.
This post was last modified on October 5, 2023 3:39 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…