టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉంది…లేదంటే జగన్ అంత ధైర్యంగా చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం లేదు…ఇటువంటి వ్యాఖ్యలు గ్రామాలలోని రచ్చబండలు మొదలు తలపండిన రాజకీయ నాయకులు సైతం చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు, చంద్రబాబు అరెస్టు విధానాన్ని మాత్రమే ఖండించిన ఏపీ బీజేపీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం ఆశీస్సులు లేవని సుజనా చౌదరి క్లారిటీనిచ్చారు. దేశంలో బీజేపీ అతి పెద్ద పార్టీ అని, ఏపీలో బీజేపీకి నష్టం జరుగుతోందన్న ఆవేదన తమకూ ఉందని ఆయన అన్నారు. బీజేపీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత ఆగ్రహంగా ఉన్నారని అంగీకరించారు. చంద్రబాబు కేసు కోర్టులో విచారణలో ఉందని, అందుకే ఎక్కువ స్పందించడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీఐడీ భాగం అని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. బీజేపీ అధిష్టానం చెప్పే అన్ని విషయాలను బయట పెట్టలేమని అన్నారు. ఏపీలో జరుగుతోన్న అరాచకాలతో బీజేపీకి సంబంధం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సుజనా చౌదరి చెప్పారు.
విచారణ సమయంలో ఏ అధికారి అయినా సమాచారాన్ని మీడియాకు ఇవ్వకూడదని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని సుజనా చౌదరి గుర్తు చేశారు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని అన్నారు. ఓ తెలుగు మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on October 4, 2023 9:36 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…