తెలంగాణా ఎన్నికల్లో 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీచేయాలనే విషయాన్ని ఐదురోజుల క్రితమే డిసైడ్ అయ్యింది. పార్టీ పోటీచేయబోయే నియోజకవర్గాలను పార్టీ తెలంగాణా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణా ఇన్చార్జి శంకరగౌడ్ మీడియాలో ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నియోజకవర్గాలను వీళ్ళు ప్రకటించారు కానీ జనాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది అసలైన పాయింట్. ఎందుకంటే తెలంగాణా జనసేన యాక్టివిటీస్ అసలు లేదు కాబట్టే.
జనసేన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీచేయబోతోంది. పోటీచేయే నియోజకవర్గాలు ఏవంటే కుకట్ పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, మేడ్చల్. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, మథిర, ఇల్లెందు, సత్తుపల్లి, పాలేరులో పోటీచేయబోతోంది. అలాగే వరంగల్ జిల్లాలోని పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు.
నల్గొండ జిల్లాలోని నకిరేకల్, మునుగోడు, హుజూరాబాద్, కోదాడ, మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండం, జగిత్యాల, హుస్నాబాద్, మంథని, ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇప్పటివరకు జనసేన జనాలను తన వైపుకు తిప్పుకోవడానికి చేసిన కృషి ఏమీ లేదు.
తెలంగాణాలో అసలు జనసేన గురించి అనుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. దాదాపు రెండేళ్ల క్రితం వైఎస్సార్టీపీని ఏర్పాటుచేసిన షర్మిల పార్టీ ఉనికి చాటటానికి నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. దీక్షలు చేశారు, ధర్నాలు, నిరసన దీక్షలు చేశారు. 24 గంటలూ కేసీయార్ టార్గెట్ గా ఆరోపణలు, విమర్శలతో హోరెత్తించేస్తున్నారు. ఇంత చేస్తున్న షర్మిల పార్టీనే జనాలు పట్టించుకోలేదు. అలాంటిది సింపుల్ గా జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందంటే జనాలు ఆదరిస్తారా ? బహుశా పవన్ అభిమానులు వరకు పార్టీకి ఓట్లేస్తారేమో అంతే.
This post was last modified on October 3, 2023 1:17 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…