టీడీపీ రథసారథి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై స్పందిస్తూ… ఏపీ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం? అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రియాక్టయిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి… తప్ప తెలంగాణ ఎవరు చేసినా ఊరుకునేది లేదు అంటూ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చేశారు. అయితే ఆయనకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా సాక్షాత్తు అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజమండ్రికి వెళ్లి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాబు కోడలు బ్రాహ్మణిని కలిశారు. ఈ పరిణామం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
చంద్రబాబు అరెస్టు అంశం కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్న కేటీఆర్ దాని గురించి తమకు అనవసరం అని కామెంట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రెండు రాజకీయ పార్టీల అంశంలా ఉందని కేటీఆర్ లైట్ తీసుకునే కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు సహజంగానే చర్చనీయాంశంగా మారింది. అయితే, అనూహ్య రీతిలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ రాజమండ్రి వెళ్లారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ సతీమణి బ్రాహ్మణిని కలిశారు. అనంతరం బండి రమేష్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు నేపథ్యంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరికి, బ్రాహ్మణికి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని బండి రమేష్ ప్రకటించారు.
కార్యదక్షత కలిగిన వ్యక్తి చంద్రబాబు అని బండి రమేష్ ప్రకటించారు. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు జీవితాన్ని దారబోశారు అని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేసిన బండి రమేష్ …చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారు అని ధీమా వ్యక్తం చేశారు. బండి రమేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్… ఏపీకి పరిమితమైన అంశంగా చంద్రబాబు అరెస్టును చూపిస్తుంటే… మరోవైపు అదే పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి ఏకంగా చంద్రబాబు జైల్లో ఉన్న చోటుకు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలపడం కీలక పరిణామంగా పేర్కొనవచ్చు. మరోవైపు తమకు సంబంధించని అంశం అని పేర్కొంటూ ఒకింత టేకిట్ ఈజీగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫీలవుతున్న అంశం ఉన్నత స్థాయిలోనే ఇంత వివిధ అభిప్రాయాలను కలిగి ఉందా అంటూ పలువురు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on September 27, 2023 7:33 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…