స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును ఈ నెల 22వ తేదీకి రిజర్వ్ చేసింది.
మరోవైపు, ఈ క్వాష్ పిటిషన్ తీర్పును బట్టి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇవ్వాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ పై తీర్పు వ్యవహారం సర్వత్రా ఉత్కంఠ రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబు తరఫున లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఏపీ సిఐడి తరఫున వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు చంద్రబాబు లాయర్లు యోచిస్తున్నారని తెలుస్తుంది.
ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబును ఏపీ సీఐడీ 5 రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయిగా ఉండడంతో ఆయననుః విచారణ జరపాలని కోరారు. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 23న జరగనుంది.
This post was last modified on September 22, 2023 4:07 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…