స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ పోలీసులు బాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో బాబును ప్రవేశపెట్టగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనల సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదన్నారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందుగా సరైన సాక్ష్యాలు చూపించాలన్నారు. కోర్టులో ఈ సెక్షన్పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అసలు 409 సెక్షన్ ఏం చెబుతోంది? ఈ సెక్షన్ కింద బాబుకు బెయిల్ వస్తుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వాళ్లు మోసం చేసినట్లయితే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 వర్తిస్తుంది. ఎవరైనా ఏదైనా పద్దతిలో ఆస్తిని అప్పగించినా లేదంటే పబ్లిక్ సర్వెంట్ హోదాలో, బ్యాంకర్, వ్యాపారి, బ్రోకర్, న్యాయవాదిగా అతని వ్యాపారంలో ఆస్తిపై ఏదైనా ఆదిపత్యం లేదంటే ఆ ఆస్తికి సంబంధించిన నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే ఈ సెక్షన్ కింద కేసు పెట్టే ఆస్కారముంది.
క్లుప్తంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ సేవకులు తమకు అప్పగించిన ఆస్తి విషయంలో నమ్మకాన్ని ఉల్లంఘిస్తే ఈ 409 సెక్షన్ కింద చర్యలు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద నేరం రుజువు అయితే ఆ వ్యక్తికి జీవిత ఖైదు లేదంటే 10ఏళ్ల వరకు శిక్షను విధిస్తారు. శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. ఇప్పుడు బాబుపై స్కిల్ డెవలప్మెంట్ కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఆయనపై నమోదు చేసిన సెక్షన్లలో 409 కూడా ఉండటం వల్ల సీఐడీ పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండానే బాబును అరెస్టు చేశారు. అయితే సెక్షన్ పెట్టినంత మాత్రానా సరిపోదని, అందుకు తగ్గ ఆధారాలు చూపించాల్సి ఉంటుందని, కారణాలు వివరించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 10, 2023 4:03 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…