ఆ యువతి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమార్తె…అది కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద కూతురు. కాలేజీలో చదువుకునే రోజుల్లో వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో ఆ యువతి ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే ఆదర్శభావాలున్న ఆ ఎమ్మెల్యే తన కూతురు ప్రేమను అంగీకరించి తన సమక్షంలోనే ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. ఆదర్శ వివాహం చేసిన సదరు ఎమ్మెల్యేపై మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతాయి. దాదాపుగా చాలా తెలుగు సినిమాలలో ఇటువంటి సీన్లు ఎన్నో చూసి ఉంటాం. అయితే, రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఇటువంటి సీన్ సాధ్యమే అని వైసిపి నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిరూపించారు.
తన పెద్ద కుమార్తె పల్లవికి ఆమె ఇష్ట పడిన యువకుడితో వివాహం జరిపించారు ప్రసాద్ రెడ్డి. బొల్లవరంలోని వెంకటేశ్వర ఆలయంలో నిరాడంబరంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఆ తర్వాత ప్రొద్దుటూరు లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈ వివాహాన్ని రాచమల్లు ప్రసాద్ రెడ్డి దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించడం విశేషం. పల్లవి చదువుకునే రోజుల్లో తన క్లాస్మేట్ పవన్ కుమార్ ను ప్రేమించింది. అయితే, ఈ విషయాన్ని తన తండ్రి ప్రసాద్ రెడ్డితో చెప్పి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని పల్లవి నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె నిర్ణయాన్ని గౌరవించిన ప్రసాద్ రెడ్డి యువకుడి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు.
ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వీరి పెళ్లి నిరాడంబరంగా నిర్వహించారు. డబ్బు, హోదా, కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పిల్లల ఇష్టానికి అనుగుణంగా వివాహం జరిపించానని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే రాచమల్లు నిర్ణయంపై సర్వతా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాచమల్లు తీరును చాలా మంది ప్రశంసిస్తున్నారు. పిల్లల ప్రేమను అర్థం చేసుకొని వివాహం జరిపించిన ప్రసాద్ రెడ్డి ఎందరో తల్లిదండ్రులకు ఆదర్శమని అంటున్నారు. పరువు కోసం సొంత బిడ్డలని కడతేరుస్తున్న ప్రస్తుత సమాజంలో ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా కూతురు ప్రేమను గౌరవించి ప్రేమ వివాహం చేయడం నిజంగా ఆదర్శనీయమని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on September 7, 2023 6:17 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…