Political News

6 వేల కోట్ల మోసం.. 4 వేల కోట్ల ఆస్తుల అటాచ్‌..!

సుదీర్ఘ విచార‌ణ‌లు, అనేక వంద‌ల‌ మంది సాక్ష్యులు.. వెర‌సి 15 ఏళ్ల‌కుపైగా సాగిన అగ్రిగోల్డ్ కుంభ‌కోణంలో ఎట్ట‌కేల‌కు చార్జిషీట్ దాఖ‌లైంది. ఈ సంస్థ ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మొత్తం 6 వేల కోట్ల‌కుపైగా సొమ్మును డిపాజిట్ల రూపంలో రాబ‌ట్టింది. అనంతరం.. బోర్డు తిప్పేసింది. దీనిపై ఆయా రాష్ట్రాల్లో కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసుల‌ను గుండుగుత్త‌గా.. ఏపీ హైకోర్టు(అప్ప‌టి ఉమ్మ‌డి) విచార‌ణ‌కు స్వీక‌రించింది.

ఈ క్ర‌మంలోనే మ‌నీలాండ‌రింగ్ కోణంలోనూ ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించి.. కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అప్ప‌గించింది. ఈ సంస్థ సుదీర్ఘ విచార‌ణ‌ల అనంత‌రం.. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ పేర్లను ప్ర‌ధాన నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు విచారణకు స్వీకరించింది. అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్‌పై అభియోగాలు దాఖలయ్యాయి.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ.4,141 కోట్ల మేర ఆస్తులను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ ఎటాచ్ చేసింది. అయితే.. మ‌రో 2000 కోట్ల‌కు పైగా సొమ్ము ఏమైంద‌నేది తేలాల్సి ఉంది. ఇదిలావుంటే, డిపాజిట‌ర్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం రెండు విడ‌త‌ల్లొ కొంత సొమ్మును తిరిగి ఇచ్చిన విష‌యం తెలిసిందే.

This post was last modified on September 6, 2023 8:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

22 minutes ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

52 minutes ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

3 hours ago

కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…

3 hours ago

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

4 hours ago