Political News

జగన్ కేసు చార్జిషీట్ లో వైఎస్ పేరు.. షర్మిల క్లారిటీ

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం వ్యవహారంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ విలీనంపై చర్చలు తుది దశకు వచ్చాయని షర్మిల అన్నారు. తన తండ్రి వైఎస్ఆర్ ను సోనియా గాంధీ గౌరవిస్తున్నారని, అందుకే చర్చలకు ఢిల్లీ వెళ్లానని షర్మిల చెప్పారు. వైఎస్సార్ కుటుంబానికి సోనియా ద్రోహం చేయలేదని షర్మిల అన్నారు. వైఎస్సార్ అంటే కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉందని చెప్పారు. అయితే, ఆనాడు జగన్ అక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరుని చేర్చిన విషయం సోనియాకు తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మా వాళ్లు కూడా సోనియానే ఆ పని చేయించారని అనుకున్నారని, తనను ప్రశ్నించారని షర్మిల అన్నారు. అందుకే, ఈ క్లారిటీనివ్వాల్సి వచ్చిందని చెప్పారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా సీబీఐ చార్జిషీటులో ఆబ్ స్కాండర్ గా రాజీవ్ గాంధీ పేరును చేర్చారని, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని సోనియా గాంధీ తనతో చెప్పారని అన్నారు. అటువంటిది, తాము వైఎస్ పేరు ఎలా చేరుస్తామని చెప్పారని షర్మిల క్లారిటీనిచ్చారు. ఇక, వైఎస్ఆర్ లేని లోటు తమకు తెలుస్తోందని రాహుల్ గాంధీ చెప్పినట్లు షర్మిల అన్నారు.

కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించేందుకే సోనియాతో చర్చలు జరిపానని షర్మిల అన్నారు. అయితే, తమ పార్టీ కేడర్ తో చర్చలు జరిపిన తర్వాతే విలీనంపై మీడియాతో మాట్లాడుతానని షర్మిల అన్నారు. త్వరలోనే అన్ని వివరాలను తెలియజేస్తానని చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలోని అన్ని పార్టీలు కలిసి రావాలని షర్మిల కోరారు. తెలంగాణలో తాను 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని, తనతో పాటు నడిచిన వారిని నిలబెడతానని అన్నారు. ఇక, ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వెళ్లిన షర్మిల తన తండ్రి వైఎస్ఆర్ కు నివాళులర్పించారు.

ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి సీఎం జగన్, షర్మిల విడివిడిగా హాజరయ్యారు. అయితే, విలీనంపై ఇడుపులపాయ దగ్గర మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు షర్మిల సమాధానమివ్వలేదు. ఆ తర్వాత హైదరాబాద్ లోని పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on September 2, 2023 10:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇంచార్జ్‌ల‌ను మార్చినా వైసీపీకి ఊపులేదు

ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో చావు దెబ్బ‌తిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా…

9 mins ago

దేవర 2 మీద అక్కర్లేని అనుమానాలు

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…

48 mins ago

మంత్రుల‌ను డిజ‌ప్పాయింట్ చేసేసిన‌ చంద్ర‌బాబు.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రుల‌ను డిజ‌ప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్ర‌వేశ…

1 hour ago

వావ్….నాగార్జున చేతికి డాల్బీ విజన్

ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…

2 hours ago

ఒట్టు..ప్రభాస్ ఎవరో తెలీదు: షర్మిల

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…

2 hours ago

బొత్సకు హగ్ ఇచ్చిన పవన్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…

3 hours ago